Home గాసిప్స్ వరుస హిట్ల హీరో…కొత్త సినిమాకి డిఫెరెంట్ టైటిల్!

వరుస హిట్ల హీరో…కొత్త సినిమాకి డిఫెరెంట్ టైటిల్!

0

కెరీర్ ని మూడు వరుస విజయాలతో మొదలు పెట్టి సినిమా సినిమా కి తన రేంజ్ ని మార్కెట్ ని పెంచుకున్న హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఒకరు… మూడు వరుస విజయాల తర్వాత ఏకంగా 6 వరుస పరాజయాల ను కూడా సొంతం చేసుకుని, ఒక్క సారిగా తన మార్కెట్ మొత్తం కోల్పోయిన టైం లో తిరిగి చిత్రలహరి సినిమాతో క్లాస్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వగా…

లాస్ట్ ఇయర్ మారుతి డైరెక్షన్ లో చేసిన ప్రతీ రోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తిరిగి కెరీర్ స్టార్టింగ్ నాటి జోరు ను చూపిస్తూ దూసుకు పోతున్నాడు. రెండు హిట్లు కొట్టి సాలిడ్ కంబ్యాక్ చేసిన సయిన్ ధరం తేజ్ నుండి ఇప్పుడు కొత్తగా…

సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సినిమా సమ్మర్ లో రావాల్సి ఉన్నా కరోనా వలన ఇయర్ ఎండ్ కి పోస్ట్ పోన్ అయింది. కాగా ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉండగా ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ ఓ డిఫెరెంట్ మూవీ చేయబోతున్నాడని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి సెలెక్ట్ చేసిన కథతో ఠాగూర్ మధు నిర్మాతగా గోపాల్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కోర్ బేస్ డ్రామా ని చేయబోతున్నాడట సాయి ధరం తేజ్… చాలా వరకు కోర్ట్ లోనే సాగే ఈ సినిమా కథ చిరు కి బాగా నచ్చిందని అంటున్నారు. అందుకే వెంటనే సాయి ధరం కి చెప్పి ఓకే చేయించాడట.

ఇక ఈ సినిమా కి (భగవద్గీత సాక్షిగా) అనే డిఫెరెంట్ టైటిల్ ని కన్ఫాం చేశారని అంటున్నారు. కోర్టు నేపధ్యంలో తెరకేక్కే సినిమానే అయినా ఒక రివెంజ్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉంటుందని అంటున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ మిగిలన షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా మొదలు పెట్టి వచ్చే ఇయర్ రిలీజ్ చేస్తారని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here