Home గాసిప్స్ ప్రభాస్ ని చూపెట్టి KGF2 అమ్ముతున్నారు….ఏమైనా తేడా వస్తే ఇలా చేస్తారు!

ప్రభాస్ ని చూపెట్టి KGF2 అమ్ముతున్నారు….ఏమైనా తేడా వస్తే ఇలా చేస్తారు!

0

ఇండియా లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో KGF చాప్టర్ 2 సినిమా ముందు నిలిచే సినిమా అని చెప్పాలి, సినిమా కి విపరీతమైన క్రేజ్ ఆడియన్స్ లో ఉండగా బిజినెస్ ఆఫర్లు కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి, కానీ ఇక్కడే నిర్మాతలు ఆఫర్లు వస్తున్నాయి కదా అని వాటితో ఆగిపోగా ఇంకా ఎక్కువ బిజినెస్ కి ట్రై చేస్తున్నారు అంటూ టాలీవుడ్ లో భారీ రచ్చే జరుగుతుంది.

KGF చాప్టర్ 2 కి కన్నడ తర్వాత ఇండియా మొత్తం మీద బిగ్గెస్ట్ క్రేజ్ ఉన్న ఏరియాలుగా రెండు తెలుగు రాష్ట్రాలను చెప్పుకోవాలి, విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం 40-45 కోట్ల రేట్లు ఓవరాల్ గా ఇవ్వడానికి చాలా మంది సిద్ధం అవ్వగా…

సినిమా యూనిట్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కూడా సినిమా బిజినెస్ 80 కి తగ్గకుండా చూసుకోవాలని చూస్తుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది, అంత రికవరీ అవ్వాలి అంటే అది కూడా తెలుగు రాష్ట్రాలలో అంటే పెద్ద సినిమాల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్ ఫైర్ అయితే దెబ్బ సాలిడ్ గా పడుతుంది…

ఇక్కడే KGF2 టీం ప్రభాస్ ని అడ్డు పెడుతున్నారు, KGF2 తర్వాత ప్రభాస్ తో మూవీ ఉండటంతో రేట్లు అంచనాలను మించి చెబుతూ ఏమైనా తేడా వస్తే సాలార్ ఉంది కదా అంటూ చెప్పుకోస్తున్నారట. ప్రభాస్ మూవీ అండ్ మాస్ కాంబినేషన్ కాబట్టి రేట్లు కూడా పెద్దగా ఆలోచించకుండా భారీ రేట్లు ఇస్తున్నారని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది.

మొత్తం మీద సినిమాకి ఎంత క్రేజ్ ఉన్నా ఇప్పుడు బిజినెస్ రెట్టింపు జరగడానికి ముఖ్య కారణం సాలారే అని అంటున్నారు. KGF2 బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతవరకు అందుకుంటుందో తెలియదు కానీ ఒకవేళ మిస్ అయితే సాలార్ ఉంది కదా అన్న ధైర్యం అయితే బయ్యర్స్ లో విపరీతంగా ఉందని తెలుస్తుంది, ప్రభాస్ తో సినిమా KGF యూనిట్ కి మరింత ధైర్యంగా KGF ని ప్రమోట్ చేసేలా చేస్తుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here