మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఫేస్ చేసిన డిసాస్టర్ మూవీస్ తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 50% ఆక్యుపెన్సీతోనే సంచలన కలెక్షన్స్ తో క్రాక్ సినిమా క్రాకింగ్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కంబ్యాక్ తో పాటు కెరీర్ బెస్ట్ హిట్ ని కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం తర్వాత రెట్టించిన జోరు తో…
సినిమాలను మొదలు పెట్టిన రవితేజ ఆడియన్స్ ముందుకు 2022 లో అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 సినిమాలతో దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉండగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన రవితేజ ఖిలాడీ మూవీ రిలీజ్ ను ఈ ఇయర్ ఫిబ్రవరి 11 కి పోస్ట్ పోన్ చేసి పోస్టర్ ను…
రిలీజ్ చేయగా ఇప్పుడు మిగిలిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుత వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతున్నా కానీ ఖిలాడీని మాత్రం ఇప్పుడు ఫిబ్రవరి 11నే రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా మరో పోస్టర్ లో కన్ఫాం చేయగా సినిమా కి బిజినెస్ ఆఫర్స్ కూడా రావడం స్టార్ట్ అయింది…
సినిమా కి కోస్టల్ ఆంధ్ర రీజన్ లో ప్రస్తుతం ఉన్న రేట్ల దృశ్యా చూసి 10 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ ని కోట్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్లు…. ఒకవేళ రేట్లు ఆంధ్రలో మునుపటిలా నార్మల్ అయితే ఇంకొంచం ఎక్కువే ఇవ్వడానికి సిద్ధం అని కూడా చెబుతున్నారని సమచారం. ఫైనల్ లెక్కలు త్వరలోనే తెలబోతుండగా మిగిలిన ఏరియాలలో కూడా ఈ సినిమా కి…
బిజినెస్ ఆఫర్స్ సాలిడ్ గానే వస్తున్నాయని సమాచారం… సాంగ్స్ ఆకట్టుకోవడం రవితేజ ఫామ్ లోకి రావడం కలిసి రాగా ట్రైలర్ ఒక్కటి సాలిడ్ గా ఉంటే సినిమా పై బజ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఫిబ్రవరిలో ఖిలాడీ బాక్స్ ఆఫీస్ ను మరోసారి క్రాక్ లాగా షేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి…