Home న్యూస్ ఖుషి రీ రిలీజ్…ఈ థియేటర్స్ ఏంటి…ఈ బుకింగ్స్ ఏంటి!!

ఖుషి రీ రిలీజ్…ఈ థియేటర్స్ ఏంటి…ఈ బుకింగ్స్ ఏంటి!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అద్బుతమైన క్లాస్ లవ్ స్టొరీ అండ్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ఖుషి… రెండు దశాబ్దాల క్రితం అభిమానులను ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించిన ఈ సినిమాను ఇప్పుడు రీ మాస్టర్ వర్షన్ లో 4K లో ఆడియన్స్ ముందుకు ఈ న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా రీ రిలీజ్ కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండటం న్యూ ఇయర్ వీకెండ్ లో కొత్త సినిమాలు ఏమి కూడా లేక పోవడంతో ఖుషీని గ్రాండ్ గా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు… కాగా ఒక్క నైజాం ఏరియాలోనే ఇప్పటి వరకు…

సినిమా కి 130 థియేటర్స్ కన్ఫాం అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 280 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ దక్కనుంది. బుకింగ్స్ ని బట్టి ఈ లెక్క పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా కి ఇప్పటి వరకు…

జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 1.05 కోట్ల దాకా గ్రాస్ బుకింగ్స్ జరిగాయి. రీసెంట్ టైం లో ట్రెండ్ గా మారిన రీ రిలీజ్ మూవీస్ లో ఇది జల్సా తర్వాత సెకెండ్ బెస్ట్ అని చెప్పాలి. ఇక రిలీజ్ టైంకి ఈ బుకింగ్స్ జోరు మరింత సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here