Home న్యూస్ అక్షరాలా 100 కోట్లు…కానీ ఇలా చేశారెంటీ!!

అక్షరాలా 100 కోట్లు…కానీ ఇలా చేశారెంటీ!!

0

ఏడాదిన్నర నుండి వస్తున్న ఈ వేవ్ ల ఎఫెక్ట్ వలన చాలా సినిమాలకు థియేటర్స్ లో రిలీజ్ కన్నా కూడా డిజిటల్ లో రిలీజ్ అయితే బెటర్ మనీ అండ్ రిస్క్ ఫ్రీ గా ఉండొచ్చని ఆ విధంగా ఆలోచించి డిజిటల్ రిలీజ్ కి సై అంటున్నారు కానీ ఇది పెద్ద సినిమాలకు వర్తించదు అని ముందు అనుకున్నా కానీ ఏడాదిన్నరలో కొన్ని క్రేజీ మూవీస్ కి కూడా డిజిటల్ లో…

సాలిడ్ డీల్స్ దక్కడంతో మరో ఆప్షన్ లేక డైరెక్ట్ గా డిజిటల్ లోనే రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్ సెకెండ్ ఆఫ్ నుండి పెద్ద సినిమాలు ఒకటి రెండు మినహా చాలా సినిమాలు థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వగా ఇప్పుడు థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన….

   

థియేటర్స్ ఇంకా అన్ని చోట్లా ఓపెన్ చేయాల్సి ఉండగా ఫుల్ ప్లేట్చుడ్ గా ఆపరేట్ చేయడానికి మరి కొన్ని వారాలు టైం పట్టేలా ఉండటంతో పెద్ద సినిమాలకు గేలం వేయడం ఓటిటి వాళ్ళు ఆపడం లేదు. లేటెస్ట్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ…

విక్రమ్ రోనా సినిమా ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా వస్తూ ఉండగా హై బడ్జెట్ తో భారీగా, విజువల్ వండర్ లా రూపొందిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉండగా సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా థియేటర్స్ క్లోజ్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఏకంగా 100 కోట్ల ఆఫర్ ను ఇచ్చారట ఓటిటి వాళ్ళు…

కే.జి.ఎఫ్ సినిమా తర్వాత కన్నడ మూవీస్ లో 100 కోట్ల డిజిటల్ రైట్స్ ఆఫర్ ను సొంతం చేసుకున్న సినిమా గా ఈ సినిమా నిలవగా మేకర్స్ మాత్రం పాన్ ఇండియా లెవల్ లో పరిస్థితులు సద్దుకున్నాక థియేటర్స్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని కన్ఫాం చేశారట. దాంతో 100 కోట్ల ఆఫర్ కి టీం నో చెప్పినట్లు అయింది… మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here