సీతారామం సినిమాతో భారీ విజయాన్ని తెలుగు లో సొంతం చేసుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త(King Of Kotha Telugu) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. అన్ని వర్షన్ లు కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా…
2500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉండగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…. కొత్త ఏరియా లో ఇద్దరు స్నేహితులు మాఫియాలో చేరి ఎలా ఎదిగారు…
తర్వాత ఎదిగిన తర్వాత ఎం జరిగింది. మిత్రుల మధ్య గొడవలు ఎక్కడి దాకా వెళ్ళాయి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కింగ్ ఆఫ్ కొత్త సినిమా కథ పాయింట్… ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ చాలా నార్మల్ కథతో తెరకెక్కగా చాలా ఎక్కువ లెంత్ తో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా….
అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ హెల్ప్ వలన వీక్ సీన్స్ కూడా కొన్ని బాగా మెప్పించినా, హీరో మాస్ లుక్ తో మెప్పించినా కూడా లెంత్ మరీ ఎక్కువ అవ్వడం, కథ చాలా స్లోగా సాగడం వలన చాలా ఓపికతో సినిమాను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. అలా చూస్తె సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పించవచ్చు…
దుల్కర్ సల్మాన్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేయగా మాస్ సీన్స్ లో కూడా మెప్పించాడు. తెలుగు డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు. ఇక మిగిలిన యాక్టర్స్ తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేక పోవడంతో ఉన్నంతలో వాళ్ళు కూడా మెప్పించగా… సినిమా కి బిగ్ ప్లస్ పాయింట్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ నిలిచింది…
మాస్ సీన్స్ తో పాటు నార్మల్ సీన్స్ కి కూడా ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా కొంత లెంత్ ని తగ్గించి క్రిస్ప్ రన్ టైంతో రిలీజ్ చేసి ఉంటే ఆడియన్స్ కి స్టోరీ పాయింట్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా ఆకట్టుకునే అవకాశం కొంచం ఎక్కువగా ఉండేది…
కానీ లెంత్ ఎక్కువగా ఉండటం, కథనం చాలా నెమ్మదిగా సాగడం అలాగే కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్ కాగా హీరో క్యారెక్టర్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎక్స్ లెంట్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా లో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా…
కొంచం ఓపికతో చూస్తె సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు కానీ కొంచం ఓపిక ఎక్కువ అవసరం అని చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే సినిమా ఓవరాల్ గా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. సినిమాకి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…
Review ivvadam radhu chetha vedava vere language movie ani bad ga rastava