Home న్యూస్ ఓవర్సీస్ కింగ్ నే డామినేట్ చేస్తున్న డైనోసార్…ప్రభాస్ మాస్ ఊచకోత!

ఓవర్సీస్ కింగ్ నే డామినేట్ చేస్తున్న డైనోసార్…ప్రభాస్ మాస్ ఊచకోత!

0

ఇండియన్ హీరోల్లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అందరి కన్నా ముందు నిలుస్తాడు అని చెప్పాలి. ఒకప్పుడు బాలీవుడ్ ని వన్ మ్యాన్ ఆర్మీ గా ఏలిన షారుఖ్ తర్వాత ఫామ్ కోల్పోయినా కూడా ఈ ఇయర్ లో…

చేసిన పఠాన్(Pathaan) మూవీ తో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఈ కమర్షియల్ మూవీతో ఓవర్సీస్ లో కూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డులు క్రియేట్ చేయగా ఏకంగా 396 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో అందుకుని సంచలనం సృష్టించాడు…

అలాంటి కింగ్ ఖాన్ కొత్త సినిమా జవాన్(Jawan Movie) మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కాబోతుండగా సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఈ సినిమా బుకింగ్స్ ని ఇంకా 35 రోజుల టైం ఉన్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ…

సలార్(salaar part 1 – ceasefire) ప్రీ బుకింగ్స్ తో ఊరమాస్ అనిపించే రేంజ్ లో డామినేట్ చేస్తుంది… ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల క్రేజ్ పవర్ వలన కావొచ్చు చాలా టైం తర్వాత ప్రభాస్ మాస్ మూవీ చేయడం వలన కావొచ్చు ఎక్స్ లెంట్ బజ్ ఈ సినిమా మీద ఉంది… 

జవాన్ మూవీ ఇప్పటి వరకు అక్కడ $161K డాలర్స్ మార్క్ ని మాత్రమే అందుకుంటే రిలీజ్ ఇంకా 35 రోజుల టైం ఉండి…ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అవ్వని సాలార్ మూవీ ఆల్ మోస్ట్ $200K మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం అక్కడ సాలార్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో చెప్పకనే చెబుతుంది. ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక రచ్చ మరో లెవల్ కి వెళ్ళడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here