Home న్యూస్ 150 కోట్లతో తీస్తే అట్టర్ ఫ్లాఫ్ అయింది…ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకున్నారు!

150 కోట్లతో తీస్తే అట్టర్ ఫ్లాఫ్ అయింది…ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ వేసుకున్నారు!

0

అప్పుడప్పుడూ సినిమా కలెక్షన్స్ పోస్టర్స్ చూసినప్పుడు, సినిమా కి వచ్చిన రిజల్ట్ ని చూసి ఈ కలెక్షన్స్ పోస్టర్స్ ఏంటి రా బాబు అనుకోవడం కామన్ అనే చెప్పాలి. అలాగే అట్టర్ ఫ్లాఫ్ అయిన సినిమా పోస్టర్స్ మీద కూడా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

ఒకప్పుడు అంటే జనాలకు కలెక్షన్స్ పై అవగాహన లేక పోవడంతో వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు అందరికీ సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ తెలుస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైం లో కూడా సినిమా పోస్టర్స్ మీద రికార్డులు రికార్డులు అంటూ పోస్టర్స్ వదిలితే…

అవి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కారణం అవుతూ ఉండగా రీసెంట్ గా కలెక్షన్స్ పోస్టర్ కాకున్నా డిజిటల్ రిలీజ్ కోసం వదిలిన పోస్టర్ లో అట్టర్ ఫ్లాఫ్ అయిన సినిమా ను ఈ ఇయర్ ఏకంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ చెప్పడంతో…

ఆల్ రెడీ రిలీజ్ టైంలోనే భారీ ట్రోల్స్ ని ఫేస్ చేసిన సినిమాను ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. ఆ సినిమానే SALMAN KHAN నటించిన లేటెస్ట్ మూవీ Kisi Ka Bhai Kisi Ki Jaan సినిమా… 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 110 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా…

అలాంటి ఈ సినిమాను ఇప్పుడు 23న జీ5 యాప్ లో డిజిటల్ రిలీజ్ చేస్తుండగా సినిమా పోస్టర్ లో ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే 1050 కోట్లు వసూల్ చేసిన PATHAAN మూవీ ఏమవ్వాలి అంటూ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here