బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైనా కొత్త సినిమాల రాక తో పాత సినిమాల కలెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి… అది కామన్ అనే చెప్పొచ్చు… ఇక సంక్రాంతి సీజన్ కి వస్తే కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా దుమ్ము లేపడం కామన్, కానీ ఈ సారి మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.
సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ చేస్తుంది అంటే వర్కింగ్ డేస్ లో సినిమా కలెక్షన్స్ కొత్త సినిమాల కన్నా ఎక్కువగా వస్తూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు. సినిమా 9 వ రోజు నుండి రెండో వారం వర్కింగ్ డేస్ ను ఎదురు కోగా మిగిలిన సంక్రాంతి సినిమాలు ఈ సినిమా కన్నా కూడా..
కొత్తవే అయినా కానీ అల్టిమేట్ ట్రెండ్ ను సాధిస్తూ సూపర్బ్ గా హోల్డ్ చేస్తుంది. క్రాక్ 9 వ రోజు 1.52 కోట్ల షేర్ తో మిగిలిన సినిమాలను డామినేట్ చేయగా 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.22 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. మిగిలిన సినిమాల్లో రామ్ రెడ్ మూవీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు 79 లక్షల షేర్ ని సాధించగా, అల్లుడు అదుర్స్ సినిమా 28 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది… ఇక మాస్టర్ మూవీ 54 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అన్ని సినిమాలు మొదటి వారంలోనే ఉండగా రెండో వారం లో ఉన్న క్రాక్ మాత్రం ఇలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం అనే చెప్పాలి.
మొత్తం మీద మిగిలిన సినిమాల్లో బెస్ట్ టాక్ ఈ సినిమా కే ఉండటం థియేటర్స్ విషయం లో గొడవలు లాంటివి జరగడం రిలీజ్ రోజు ఇబ్బందులు ఎదురుకోవడం తో సినిమా పై జనాల్లో ఆసక్తి ఎక్కువగా పెరిగింది, దానికి తోడూ రవితేజ కంబ్యాక్ మూవీ అవ్వడం సినిమా కి మరింత హెల్ప్ అయ్యి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ గా లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటుంది…