మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇంకా జోరు చూపుతుంది, సినిమా డిజిటల్ రిలీజ్ రీసెంట్ గా జరిగినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వారం ఆదివారం కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం చేసింది. సినిమా రిలీజ్ అయిన 29 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాల కారణంగా చాలా తక్కువ థియేటర్స్ నే కలిగి ఉన్నా కానీ ఉన్న వాటిలోనే…
సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం విశేషం అనే చెప్పాలి. లాంగ్ రన్ ని సాలిడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా 29 వ రోజు 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక సినిమా తమిళ్ లో మలయాళం లో డబ్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ అయింది…
పెద్దగా ప్రమోషన్ లు చేయకున్నా కానీ సినిమా అక్కడ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సాధించి 32 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. టోటల్ గా షేర్ 16 లక్షల రేంజ్ లో వచ్చింది అని సమాచారం. మంచి ప్రమోషన్ లు లాంటివి చేసి ఉంటె సినిమా మరింత బెటర్ కలెక్షన్స్ ని సాధించేది.
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 11.78Cr
👉Ceeded: 6.04Cr
👉UA: 4.16Cr
👉East: 3.23Cr
👉West: 2.40Cr
👉Guntur: 2.74Cr
👉Krishna: 2.35Cr
👉Nellore: 1.77Cr
AP-TG Total:- 34.47CR (57.75Cr Gross~)
KA+ROI: 1.65Cr(Updated)
OS: 86L (Updated)
Tamil+Malayalam Dub – 16L(32L Gross)
Total: 37.14Cr(62.55Cr~ Gross) (Updated)
ఇవీ సినిమా టోటల్ గా 29 రోజులు పూర్తీ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు. సినిమా 37 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి రవితేజ కెరీర్ లో మరో మైలురాజు ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమాను తమిళ్ లో మలయాళంలో ఓన్ గానే రిలీజ్ చేశారట.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 29 రోజుల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ తర్వాత సినిమా టోటల్ గా 19.64 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో 20 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది…