రవితేజ క్రాక్ రిలీజ్ కి ముందు వరుసగా 4 డిసాస్టర్ మూవీస్ వెక్కిరించాయి, రిలీజ్ రోజున అనేక అవరోధాలను ఎదురుకోవాల్సి వచ్చి రిలీజ్ కి నోచుకోలేదు, సెకెండ్ షోలు తక్కువ చోట్లే పడ్డాయి… రిలీజ్ తర్వాత థియేటర్ సమస్యలు. నాసిరకం థియేటర్స్ ఇచ్చినా కానీ క్రాక్ సినిమా టాక్ జనాలలో సాలిడ్ గా రీచ్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోయింది రవితేజ క్రాక్ మూవీ..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ రెండు వారాల్లో రవితేజ కెరీర్ నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 17 వ రోజు రిపబ్లిక్ డే హాలిడే దక్కగా సినిమా రెట్టించిన జోరు చూపింది…
దాంతో పాటు రవితేజ పుట్టిన రోజు కూడా అవ్వడం తో కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. అవి ఏ రేంజ్ అంటే ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ ఇంచ్ క్లోజ్ గా అందుకుంది ఈ సినిమా. టాలీవుడ్ లో 17 వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని…
బాహుబలి 2 ఏకంగా 4.10 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో అందుకోగా నాన్ బాహుబలి మూవీస్ లో అల వైకుంఠ పురంలో సినిమా 1.26 కోట్ల షేర్ ని అందుకుంది, క్రాక్ 1.25 కోట్ల దాకా వచ్చి ఒక్క లక్ష తేడాతో ఇండస్ట్రీ రికార్డ్ ను మిస్ చేసుకుంది, అయినా కానీ క్రాక్ 50% ఆక్యుపెన్సీ తో రన్ అవ్వడంతో ఫుల్ కెపాసిటీ ఉండి ఉంటె రికార్డ్ భారీ లీడింగ్ తో పెట్టి ఉండేది అని చెప్పాలి. మొత్తం మీద…
17 వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#AlaVaikunthaPurramuloo- 1.26Cr
👉#Krack – 1.25Cr
👉#Sarrainodu – 1.08Cr
👉#Srimanthudu – 1.06Cr
👉#SarileruNeekevvaru – 82L
👉#F2 – 76L
ఇంకా చాలా సినిమాల దాటా తెలియాల్సి ఉంది, అవన్నీ తెలిశాక ఫుల్ లిస్టుని మరోసారి అప్ డేట్ చేస్తాం. ఇప్పటికి అయితే ఇవి టాప్ 6 లో నిలిచిన టాలీవుడ్ సినిమాలు…