మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సినిమా ఆల్ మోస్ట్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని అల్టిమేట్ కలెక్షన్స్ తో రన్ అవుతూ ఉండగా రవితేజ కి వరుస ఫ్లాఫ్స్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది ఈ సినిమా.. రాజా ది గ్రేట్ తర్వాత 4 వరుస డిసాస్టర్ మూవీస్ తర్వాత సంక్రాంతి బరిలో క్రాక్ సినిమా తో వచ్చిన…
రవితేజ కి మొదటి రోజు రిలీజ్ టైం లో అనేక అవరోధాలు ఎదురు అయినా కానీ తర్వాత అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా గురించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… సినిమా…
డిజిటల్ హక్కులను ఆహా వాళ్ళు భారీ రేటు చెల్లించి దక్కించుకున్నారు. కాగా అగ్రిమెంట్ చేసుకునే టైం లో సినిమాను రిలీజ్ అయిన 25 రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్ వస్తుంది. ఆ లెక్కన ఈ సినిమాను ఇప్పుడు జనవరి…
29 న ఆహా యాప్ లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో గట్టిగా చక్కర్లు కొడుతుండగా సోషల్ మీడియా లో కూడా ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. మేకర్స్ వరకు కూడా న్యూస్ వెళ్ళినా అలాంటిదేమీ లేదూ అంటూ ఎవ్వరూ కూడా కామెంట్స్ ఇప్పటి వరకు అయితే చేయలేదు. దాంతో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం ఏమో అని అంతా అనుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని..
సాలిడ్ కలెక్షన్స్ తో సొంతం చేసుకునేలా దూసుకు పోతున్న క్రాక్ సినిమా ఇలా త్వరగా డిజిటల్ రిలీజ్ అయితే అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ అప్పటికే సినిమా మేజర్ రన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఫైనల్ గా ఇది నిజం అవుతుందో లేక అబద్దం అవుతుందో చూడాలి…