Home న్యూస్ క్రాక్ కి నిర్మాత దెబ్బ… షోలు కాన్సిల్…అసలు ఏం జరిగింది అంటే?

క్రాక్ కి నిర్మాత దెబ్బ… షోలు కాన్సిల్…అసలు ఏం జరిగింది అంటే?

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఈ రోజు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వగా సినిమా రిలీజ్ కి ఎదురుదెబ్బ తగిలింది, ప్రీమియర్ షోలు చాలా తక్కువగా పడగా రెగ్యులర్ స్పెషల్ షోలు కూడా చాలా తక్కువ చోట్ల పడగా ఇప్పుడు మార్నింగ్ షోల రిలీజ్ కి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా నిర్మాత అయిన ఠాగూర్ మధు ఇది వరకు నిర్మించిన…

సినిమా అయిన విశాల్ అయోగ్య సినిమా ను తమిళనాడు లో కొన్న మల్టీప్లెక్స్ ఓనర్లు సినిమా నిర్మాతకి ఇది వరకే నష్టాలు తీర్చమని కోరినప్పటికీ కూడా పట్టించుకోలేదట… తర్వాత ఆ చర్చలు జరుగుతున్నా కానీ సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఉండవి భావించి…

సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం చేయగా చివరి నిమిషంలో మళ్ళీ బయ్యర్లు థియేటర్ ఓనర్లు నిర్మాత కి నష్టాలు తీర్చాలి అని చెప్పడం తో చర్చలు జరుగుతున్నా కానీ థియేటర్స్ లో షోలు కాన్సిల్ చేశారు. దాంతో అక్కడక్కడా షోలు పడినా కానీ నార్మల్….

రెగ్యులర్ షోలకు మాత్రం ఇబ్బంది కలిగి అన్ని చోట్లా షోలు కాన్సిల్ చేశారు. దాంతో మార్నింగ్ షోలకు కంప్లీట్ గా షోలు ఎక్కడా పడలేదు. ఇక మ్యాట్నీ షోల సమయానికి పరిస్థితులు సద్దుకుంటాయి అని అంటున్నా కానీ ఎంతవరకు పనులు అవుతాయి అన్నది మాత్రం చెప్పలేం అంటున్నారు. ఇది మొత్తం మీద సినిమా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎంతైనా ఉంది… పెద్ద సినిమా అంటే మొదటి రోజు…

కలెక్షన్స్ సాలిడ్ గా ఉంటాయి, కానీ ఇప్పుడు షోలు కాన్సిల్ అవుతూ రావడం తో సినిమా ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా నిరాశ పరచడం ఖాయం, ఎంత త్వరగా పరిస్థితి సద్దుకుంటే అంత మంచిది అని చెప్పాలి. మరి పరిస్థితులు సద్దుకుని సినిమా త్వరగా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here