Home న్యూస్ ఫ్లాఫ్ టాక్ అన్నారు…..55 కోట్లు ఔట్ అక్కడా!!

ఫ్లాఫ్ టాక్ అన్నారు…..55 కోట్లు ఔట్ అక్కడా!!

0

విజయ్ సేతుపతి, సమంత మరియు నయనతార ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘కన్మణి రాంబో ఖతీజా’ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకేసారి రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి రిలీజ్ కి ముందు ఉన్న బజ్ దృశ్యా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… తెలుగు లో టాక్ ఫ్లాఫ్ రేంజ్ లోనే ఉండగా తమిళ్ లో కూడా జస్ట్ యావరేజ్ అనిపించే……

రేంజ్ లో సొంతం చేసుకోగా సినిమా మొత్తం మీద ఫ్లాఫ్ టాక్ నే సొంతం చేసుకున్నప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం సాలిడ్ గా కుమ్మేసింది సినిమా… తెలుగు లో సినిమాకి 2.60 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….

👉Nizam: 56L
👉Ceeded: 25L
👉UA: 24L
👉East: 11L
👉West: 7L
👉Guntur: 11L
👉Krishna: 10L
👉Nellore: 7L
AP-TG Total:- 1.51CR(2.65Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో…

టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. అది కష్టమే అని చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 35.10Cr
👉Karnataka- 3.15Cr
👉Telugu States – 2.65Cr
👉Kerala+ROI – 1.00CR~
👉Overseas – 16.80Cr(Approx)
Total WW collection – 58.70CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్….

మొత్తం మీద సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది అన్న అకానీ విజయ్ సేతుపతి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది. తమిళ్ టోటల్ బిజినెస్ రివీల్ చేయలేదు కానీ 25 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా….ఆ లెక్కన సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యిందని అని అంచనా… ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here