Home న్యూస్ కురుప్ మూవీ రివ్యూ…కుమ్మింది సినిమా…కానీ!!

కురుప్ మూవీ రివ్యూ…కుమ్మింది సినిమా…కానీ!!

0

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన భారీ మూవీ కురుప్…. కేరళలో నోటోరియస్ క్రిమినల్ గా పేరున్న సుధాకర్ కురుప్ లైఫ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ క్రైం థ్రిల్లర్ మూవీ ఎప్పటి నుండో వార్తల్లో ఉంది, డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పి సౌత్ భాషలన్నింటిలోనూ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసు కుందాం పదండీ… ముందుగా కథ విషయానికి వస్తే…

ఆర్మీ ఆఫీసర్ నుండి నోటోరియస్ క్రిమినల్ గా మారిన హీరోని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తూ ఉంటారు, అసలు హీరో క్రిమినల్ గా ఎందుకు మారాడు, పోలీసులు హీరోని పట్టుకున్నారా లేదా… పెర్షియాలో కురుప్ పేరు మీద ఉన్న లైఫ్ ఇంష్యురెన్స్ ని సొంతం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు…

ఇలాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డిలివరీ కానీ, మ్యానరిజమ్స్ కానీ ప్రతీ ఒక్కటీ అద్బుతంగా మెప్పించాయి, తన తెలుగు డైలాగ్ డిలివరీ మరింత బాగా ఇంప్రూవ్ అయింది. ఇక హీరోయిన్ శోభితా దులిపలా పర్వాలేదు అనిపించగా…

మిగిలిన యాక్టర్స్ కూడా ఆకట్టుకున్నారు. ఇక సాంగ్స్ సిట్యువేషన్ కి తగ్గట్లు డీసెంట్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పాలి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ చాలా నీరసంగా ఉన్నా సెకెండ్ ఆఫ్ చాలా బాగా మెప్పించింది, సినిమాటోగ్రఫీ – ప్రొడక్షన్ వాల్యూస్ బాగా మెప్పించాయి. కథ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా అసలు కథ…

ఏంటి అనేది అర్ధం అవ్వడానికి చాలా టైమే పట్టింది, దాంతో ఫస్టాఫ్ మొత్తం నీరసంగా సాగి ఏమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది, కానీ సెకెండ్ ఆఫ్ టోటల్ లెక్క మారిపోయింది, ఆసక్తి కరమైన సీన్స్ తో తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తిని పెంచి ఆ హైప్ ను మెయిన్ టైన్ చేస్తూ సెకెండ్ ఆఫ్ ఆకట్టుకుంది…

ఫస్టాఫ్ తర్వాత అంచనాలు తగ్గినా సెకెండ్ ఆఫ్ ఇంప్రెస్ చేయడంతో ఓవరాల్ గా ఓ మంచి సినిమా చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి వస్తాం. కొంచం లెంత్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించేది, డబ్ మూవీనే హీరో తెలుగు డబ్బింగ్ చెప్పడంతో చాలా వరకు డబ్బింగ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలగకుండా ఆకట్టుకున్నారు.

మొత్తం మీద సెకెండ్ ఆఫ్ బాగుండటంతో ఫస్టాఫ్ నీరసంగా ఉన్నా కానీ ఓవరాల్ గా సినిమా కుమ్మింది అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ కోసం తన పెర్ఫార్మెన్స్ కోసం సెకెండ్ ఆఫ్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు, ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ ఫస్టాఫ్ కి ఏం అర్ధం కాకపోయినా సెకెండ్ ఆఫ్ చూసి ఇంప్రెస్ అవ్వడం ఖాయం… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here