Home న్యూస్ ఒక్క పాటతో హైప్ ఆకాశాన్ని దాటింది…నటవిశ్వరూపం ఖాయం అంటున్నారు!

ఒక్క పాటతో హైప్ ఆకాశాన్ని దాటింది…నటవిశ్వరూపం ఖాయం అంటున్నారు!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ పై అంచనాలు ఎన్ని ఉన్నాయో విమర్శలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి, ఇది లారెన్స్ డైరెక్షన్ లోనే తెరకెక్కిన సినిమానే అయినా లారెన్స్ ఇది వరకు చేసిన కాంచన సినిమా కి రీమేక్ అవ్వడం తో ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా మరో పక్క బాలీవుడ్ మూవీస్ పై సుశాంత్ ఫ్యాన్స్ విముఖత ఇంకా కొనసాగుతూ ఉండటం…

అందునా అక్షయ్ కుమార్ సుశాంత్ సినిమాలను కొన్ని లాక్కొని చేశాడు అన్న రూమర్స్ ఉండటం తో ఈ సినిమాను బాయికాట్ చేయాలనీ ట్రెండ్ చేస్తూ ఉండగా మరో పక్క సినిమాలో ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి ని లవ్ చేయడం తో…

అక్కడక్కడా జరిగిన లవ్ జీహాద్ ని ఎంకరేజ్ చేస్తున్నారని విమర్శలు వస్తూ ఉండగా సినిమా కి మళ్ళీ హైప్ ని ఎలా పెంచాలి అని ఎదురు చూస్తున్న తరుణంలో సినిమాలో అతి ముఖ్యమైన క్లైమాక్స్ సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు యూనిట్… ఆ సాంగ్ ఒక్కసారిగా సినిమాకి ఊపిరి పోసింది అని చెప్పాలి.

సాంగ్ లో అక్షయ్ కుమార్ లారెన్స్ రేంజ్ లో కాకున్నా కానీ బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయని గెటప్ లో అల్టిమేట్ మాస్ అనిపించే రేంజ్ పెర్ఫార్మెన్స్ తో లారెన్స్ కి తగ్గ లెవల్ లో అదరగొట్టేశాడు అని చెప్పాలి. సాంగ్ కి ఒక్కసారిగా హైప్ మరో లెవల్ లో పెరగగా ఇప్పుడు సినిమా పై అంచనాలు కూడా సాలిడ్ గా పెరిగిపోయాయి అని చెప్పాలి.

దాంతో ఇప్పుడు ఎక్కువ శాతం ఆడియన్స్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తుండగా విమర్శలు కొద్ది వరకు ప్రస్తుతానికి తగ్గాయి, పేరు కూడా లక్ష్మీ బాంబ్ నుండి లక్ష్మీ కి మార్చడం తో రిలీజ్ టైం కి పెద్దగా ఇబ్బందులు లేకుండా వస్తున్న ఈ సినిమా లో అక్షయ్ కుమార్ నట విశ్వరూపం చూస్తారు అంటున్నారు యూనిట్ వాళ్ళు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here