హిట్ కోసం చాలా కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ లో ఏ సినిమా కోసం పడని కష్టం తన లేటెస్ట్ మూవీ లక్ష్య విషయంలో పడ్డాడు. తన లుక్ ని బాడీని కంప్లీట్ గా మార్చుకుని సినిమా కోసం ఎంతో కష్టపడ్డ నాగశౌర్య లక్ష్య సినిమా తో తన లక్ష్యాన్ని అందుకుని చాలా కాలంగా ఎదురు చూస్తున్న హిట్ ని అందుకున్నాడో లేదో తెలుసు కుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే….
తన తాత ప్రోత్సాహంతో ఆర్చరీ మీద ఇష్టం పెంచుకున్న హీరో ఒక్కో అడుగు వేస్తూ గేమ్ లో దూసుకుపోతున్న వేల అనుకోకుండా తన తాత చనిపోవడం అదే టైం లో హీరో కెరీర్ లో ఎదగడం ఇష్టం లేని వాళ్ళు తనకి డ్రగ్స్ ని అలవాటు చేయడంతో తన కెరీర్ స్పాయిల్ అవుతుంది…
ఇలాంటి టైం లో హీరో ఎలా తన కెరీర్ లో తిరిగి గాడిలో పడ్డాడు….. జగపతిబాబు హీరోకి ఎలా హెల్ప్ చేశాడు, హీరోయిన్ తో తన లవ్ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సింపుల్ గా కథ చెప్పాలి అంటే అతి సాదారణమైన కథ పాయింట్ తో…
వచ్చిన సినిమా లక్ష్య… స్పోర్ట్స్ బ్యాగ్రాప్ మూవీ అంటే ఈ మధ్య ఎక్కువగా వచ్చిన సినిమాల్లో ఉండే కథ పాయింట్ హీరోకి ఆ గేమ్ మీద ఇష్టం కలిగి గేమ్ లో ఓ మంచి పొజిషన్ కి వచ్చాక ఒక ఇబ్బంది రావడం, ఆ ఇబ్బందిని హీరో ఎలా అధిగమించి సక్సెస్ అయ్యాడు అన్న కాన్సెప్ట్ చాలా సినిమాల్లో కనిపించగా కొన్ని సినిమాలకు వర్కౌట్ అయింది….
కానీ ఈ పాయింట్ రొటీన్ అయిపోయినా సినిమాలో హీరో పడే ఆ ఇబ్బంది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండి, ఆ ప్రాబ్లమ్ ని హీరో ఎదురుకొనే సన్నివేశాలు బాగుంటే ఈజీగా ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అదే మిస్ అయింది… కబడ్డీ, కుస్తీ, హాకీ, క్రికెట్ ఇలా…
మాస్ కి కనెక్ట్ అయ్యే గేమ్స్ తో పోల్చితే ఆర్చరీ అంతగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాంటి కథని ఆడియన్స్ మెచ్చేలా తీస్తే రీచ్ కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ అది కుదరలేదు…. కథ లో ఏం జరగబోతుంది అన్నది చూస్తున్న ఆడియన్స్ చాలా వరకు గెస్ చేస్తారు, ఆ గెస్ లో చాలా వరకు నిజం అవ్వడంతో…
ప్రిడిక్టబుల్ కథగా మారిపోయిన ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంత కష్టపడాలో అంతకుమించే కష్టపడ్డాడు, కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ కష్టం వృధా అయింది. కానీ నాగశౌర్య మాత్రం ఆకట్టుకోగా, హీరోయిన్ కేతికా పర్వాలేదు అనిపించగా జగపతిబాబు రోల్ కూడా ఆకట్టుకోగా మిగిలిన రోల్స్ జస్ట్ ఓకే అనిపించుకోగా…
పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించగా సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెప్పించగా డైరెక్షన్స్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని చెప్పిన విధానం అతి సాదారణంగా ఉండటంతో ఏ దశలో కూడా మెప్పించే ప్రయత్నం చేయలేక పోయింది.
ఉన్నంతలో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండి ఏటో వెళుతూ ఉంటుంది, ఓవరాల్ గా సినిమాను డైరెక్టర్ సాదారణంగా తెరకెక్కించి స్పోర్ట్స్ మూవీనే అయినా రొటీన్ గానే అనిపించేలా చేశాడు. కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది సినిమా… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…
Are thuppass vedava cinema chusi reviews rayi, akhanda anedi oka cinema raa, ekkada lakshya cinema bagundi ani raste akhanda collections padipothayi ane kada