ఒకటి తర్వాత ఒకటి సినిమాలతో బాలీవుడ్ రికార్డులు అన్నీ తిరగరాసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా సినిమా పై అనుకోకుండా విపరీతమైన నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ పై ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే కనిపించింది, దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా రెండో రోజు కి వచ్చే సరికి…
పరిస్థితి మరింత క్షీణించి నిరాశ పరిచే రేంజ్ లో మారింది, సినిమా రెండో రోజు జనాలు లేక అనేక షోలు కాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, వీకెండ్ లో ఓ టాప్ స్టార్ మూవీ జనాలు లేక షోలు కాన్సిల్ అవ్వడం అన్నది ఎవ్వరూ ఊహించి ఉండరు.
కానీ ఇప్పుడు అదే జరిగింది, కొన్ని షోలు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా 1300 వరకు ఓవరాల్ గా షోలు జనాలు లేక కాన్సిల్ అవ్వడం అన్నది, అది కూడా ఒక టాప్ స్టార్ మూవీ కి ఇలాంటిది జరగడం అన్నది టోటల్ ఇండస్ట్రీ మొత్తం షాకయ్యే విషయం అని చెప్పాలి.
మొదటి నుండి తీవ్రంగా నెగటివిటీ ఈ సినిమా పై స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అమీర్ ఖాన్ సినిమా అంటే జనాలు ఎలా ఉన్నా చూడటానికి ఇష్టపడతారు, అలాంటి అమీర్ ఖాన్ నటించిన సినిమా కే ఇలాంటి పరిస్థితి రావడం అన్నది బాలీవుడ్ లో ఇప్పుడు ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు.. సినిమా బడ్జెట్ కానీ ఓవరాల్ బిజినెస్ కానీ భారీ రేంజ్ లో ఉండగా…
ఇప్పుడు ఆడియన్స్ నుండి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే బాలీవుడ్ చరిత్రలో ఈ సినిమా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచే రేంజ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక సౌత్ డబ్బింగ్ వర్షన్ లను కూడా అసలు ఎవ్వరూ పట్టించుకోక పోవడం విచారకరం అని చెప్పాలి.
Don’t watch this movie go for anyone