Home గాసిప్స్ ప్రకంపనలు సృష్టిస్తున్న లారెన్స్ దుర్గ….ఏమి చెప్పని మేకర్స్!

ప్రకంపనలు సృష్టిస్తున్న లారెన్స్ దుర్గ….ఏమి చెప్పని మేకర్స్!

0

కొరియో గ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి తర్వాత సంగీత దర్శకుడిగా తర్వాత హీరోగా మారిన రాఘవ లారెన్స్ ఆడియన్స్ ను ఎక్కువగా కాంచన సిరీస్ తో మెప్పించాడు అని చెప్పాలి. ముని సినిమా నుండి మొదలైన ఈ సిరీస్ కాంచన గా మారి తర్వాత వరుస పెట్టి ఈ కాన్సెప్ట్ లో సీక్వెల్స్ వస్తున్నా ఆడియన్స్ ఈ సీక్వెల్స్ ను ఎంజాయ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను చేస్తున్నారు.

రెండేళ్ళ క్రితం కాంచన 3 ఆడియన్స్ ముందుకు రాగా మిక్సుడ్ టాక్ తోనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు తమిళ్ కలిపి 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించిన ఆ సినిమా తర్వాత…

లారెన్స్ వరుస పెట్టి సినిమాలను కమిట్ అయినా ఏవి కూడా ఇప్పటి వరకు ఆడియన్స్ ముందుకు రాలేదు, కానీ రీసెంట్ గా తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి ఇటు కోలివుడ్ లో ఇటు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాడు లారెన్స్. ఒక లుక్ ఏమో…

నార్మల్ సేల్ఫీ ఫోజ్ లా అనిపించినా మరో లుక్ మాత్రం ఒక అఘోరా గెటప్ ను పోలి భయం కలిగించేలా చేసిందని చెప్పాలి. దాంతో ఈ పోస్టర్స్ ని చూసి ఈ సినిమా కాంచన సిరీస్ లో కొత్త పార్ట్ అంటూ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం కొనసాగడం స్టార్ట్ అయింది. చూస్తుంటే అలానే అనిపించినా మేకర్స్ ఎక్కడ కూడా..

సినిమా కాంచన సిరీస్ లో భాగం అంటూ ఏమి చెప్పలేదు. అలాగే సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతున్నా సినిమా ఆ సిరీస్ లో భాగమా లేక కొత్త కాన్సెప్ట్ మూవీ నా అన్నది తెలియజేయలేదు. కానీ ఈ పోస్టర్స్ తోనే సినిమా పై హైప్ పెరిగేలా చేయడంలో లారెన్స్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ ఇయర్ ఎండ్ టైం కి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here