బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో కాంచన సినిమా రీమేక్ గా తెరకెక్కిన లక్ష్మీ బాంబ్ సినిమాను లక్ష్మీ గా పేరు మార్చగా సినిమాను 125 కోట్ల రేటు కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి అమ్మగా సినిమా రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ IPL సీజన్ వలన లేట్ అయింది.
మరి సినిమా ఎలా ఉంది, ఒరిజినల్ అంత మెప్పించిందా లేదా అన్న విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే ఒరిజినల్ స్టొరీ ని అలానే తీసుకున్నా కానీ ఆత్మ కథను అలానే ఉంచి ఉప కథని కొంచం మార్చాడు లారెన్స్.
బాలీవుడ్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలా రాసుకున్న ఈ ఉపకథలో హీరో హీరోయిన్స్ ఇద్దరి మతాలు వేరు అవ్వడం తో హీరోయిన్ ఫ్యామిలీ వీళ్ళని 3 ఏళ్లుగా దూరం పెట్టగా ఒక అకేషన్ వలన తిరిగి ఫ్యామిలీలో కలిసే అవకాశం కాగా హీరోయిన్ ఇంట్లో అడుగు పెట్టిన హీరో కి… కొద్ది సమయం తర్వాత….
చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్న టైం లో ఆత్మ వీళ్ళతో ఇంటిలోకి ఎంటర్ అవుతుంది, తర్వాత ఎం అవుతుంది అన్నది అందరికీ తెలిసిన కథనే… వాటిలో పెద్దగా మార్పులు ఏమి చేయలేదు లారెన్స్… పెర్ఫార్మెన్స్ పరంగా అక్షయ్ కుమార్ తన వరకు తను ఈ ఛాలెంజింగ్ రోల్ లో అదరగొట్టేశాడు అని చెప్పాలి… బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ అటెంప్ట్ చేయని ఈ రోల్ ని…
అక్షయ్ అటెంప్ట్ చేయడమే కాకుండా మెప్పించడం విశషంలో మెచ్చుకుని తీరాల్సిందే, కానీ మనమందరమూ కూడా ముందే కాంచన చూసి ఉంటాం కాబట్టి లారెన్స్ తో పోల్చితే అక్షయ్ తేలిపోయాడు అనిపిస్తుంది. లారెన్స్ 100% ఇస్తే అక్షయ్ కుమార్ 80% వరకు ఇచ్చాడు అనిపిస్తుంది, కానీ కాంచన చూడని వాళ్లకి అక్షయ్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ నచ్చుతుంది.
ఇక హీరోయిన్ కియరా ఉన్న తక్కువ రోల్ లో మెప్పించాగా తెలుగు లో అత్తాకోడళ్ల కామెడీ వర్కౌట్ అయినట్టుగా హిందీ వర్షన్ లో అయితే వర్కౌట్ కాలేదు… మిగిలిన రోల్స్ కూడా ఉన్నంతలో ఓకే అనిపిస్తారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి…
భుర్జ్ ఖలీఫా సాంగ్ మరియు క్లైమాక్స్ భం భోలే సాంగ్స్ అద్బుతంగా ఉండగా భం భోలే సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నాసిరకంగా ఉన్నాయి. మనం ఆల్ రెడీ సినిమా ను చూసి ఉండటం వలనో ఏమో…
తర్వాత సీన్ ని ముందే అనుకోవడం, ఆ సీన్ అనుకున్నట్లే రావడం జరుగుతూ ఉండటం తో స్క్రీన్ ప్లే పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.. అక్కడికీ ఇంటర్వెల్ లో కొన్ని సీన్స్ ను క్లైమాక్స్ లో కొంచం కాన్సెప్ట్ ను మార్చినా కానీ మనకు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు కానీ ఫస్ట్ టైం చూసే వాళ్లకి ఇది బాగానే మెప్పించవచ్చు….
ఇక డైరెక్షన్ పరంగా లారెన్స్ తను నటించి డైరెక్ట్ చేసిన సినిమానే రీమేక్ చేయడం తో సినిమాకి హార్ట్ అండ్ సోల్ అనిపించే ఏ సీన్ ని కూడా హిందీ లో మిస్ చేయలేదు, దాంతో ఒరిజినల్ చూసిన వాళ్లకి రిపీటివ్ గా అనిపించడం కామన్ అనే చెప్పాలి, కానీ అక్షయ్ కుమార్ ను అద్బుతంగా చూపెట్టాడు లారెన్స్, ఫైట్స్ విషయం లో మరింత శ్రద్ధ తీసుకుని….
లారెన్స్ రెబల్ రేంజ్ ఫైట్స్ ఏవైనా కంపోజ్ చేసి ఉంటే రచ్చ మరో రేంజ్ లో ఉండేది అనిపించింది. ఓవరాల్ గా కాంచన సినిమా చూసినవాళ్ళకి మరోసారి రిపీటివ్ గా అనిపించినా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించే రేంజ్ లో ఉండటం తో మరోసారి ఈజీగా ట్రై చేసే విధంగా సినిమా ఉందని చెప్పాలి.
అదే టైం లో కథ మనకు తెలుసు కాబట్టి అక్కడక్కడా కొంచం బోర్ కొడుతుంది, ఇక ఫస్ట్ టైం చూసే వాళ్లకి సినిమా బాగా నచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. నార్త్ ఆడియన్స్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటో మరో 200 కోట్ల క్లబ్ లో అక్షయ్ ని చేర్చే వారు.. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….