Home న్యూస్ రామ్ చరణ్ మాటిస్తే మడమ తిప్పని మహారాజు-వివి వినాయక్!!

రామ్ చరణ్ మాటిస్తే మడమ తిప్పని మహారాజు-వివి వినాయక్!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి మెగాస్టార్ చిరంజీవి తో సినిమాలను నిర్మిస్తూ అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే, నిర్మాత అంటే అన్ని పనులను అందరి అవసరాలను కూడా తానె చూసుకోవాల్సి ఉంటుంది… తన నిర్మాణం లో ఇప్పటి వరకు 2 సినిమాలు రాగా రెండు సినిమాలకు పనిచేసిన వారు కూడా రామ్ చరణ్ బెస్ట్ నిర్మాత అని కితాబు ఇచ్చారు.

ఇక రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా మారి చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా కి డైరెక్టర్ అయిన వివి వినాయక్ రామ్ చరణ్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశాడు రామ్ చరణ్ ని, వ్యక్తిత్వంలో రామ్ చరణ్ అంత గొప్ప వ్యక్తీని…

   

నేను చాలా తక్కువ మందినే చూశానని, ఒక్క సారి మాట ఇస్తే ఇక మడమ తిప్పే అవకాశం రామ్ చరణ్ దగ్గర ఉండదని, ఆ మాట మీదే నిలబడతాడని చెప్పుకొచ్చాడు వినాయక్. ఖైదీ నంబర్ 150 అవకాశం నాకు అలానే వచ్చిందని, ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ నమ్మి అవకాశం ఇచ్చాడని…

ఒక సారి కమిట్ మెంట్ ఇస్తే డైరెక్టర్ హిట్స్ లో ఉన్న ఫ్లాఫ్స్ లో ఉన్నా రామ్ చరణ్ పట్టించుకోడని చెబుతూ ఇక నిర్మాతగా కూడా రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పోగిడేశాడు వినాయక్…. ఖైదీ నంబర్ 150 టైం లో ఫారన్ షూటింగ్ కి వెళ్ళిన అందరూ క్రూ దగ్గర సరిపడా డబ్బుల కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చేవారని, దాంతో పాటు…

షూటింగ్ ముగిసే టైం లో బోనస్ లు కూడా ఇచ్చాడని, సైరా టైం లో కూడా ఇలానే చేశారని సురేందర్ రెడ్డి నాకు చెప్పారని చెప్పుకొచ్చాడు వినాయక్…. గోల్డెన్ స్పూన్ లో పుట్టిన కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉండటం నిజంగా హర్షించదగ్గ విషయం అంటూ చెప్పుకొచ్చారు వినాయక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here