ఖిలాడీ అక్షయ్ కుమార్ రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా లక్ష్మీ బాంబ్… షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన ఆగిపోయి తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా… సినిమా కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 125 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది. కాగా సినిమా నవంబర్ 9 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది.
కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది, సౌత్ లో లారెన్స్ కాంచన తో పోలికల వలన యావరేజ్ అని అంటున్నా బాలీవుడ్ లో మాత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యుంటే అక్షయ్ కుమార్ ప్రజెంట్ ఫాం…
దృశ్యా అవలీలగా 200 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే సత్తా ఉన్న సినిమా ఇదని అంటున్నారు… ఇదంతా బాగానే ఉంది కానీ యూట్యూబ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు ఎవ్వరికీ జరగంది ఇప్పుడు అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ కి జరిగింది… సినిమా ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది…
ఆ ట్రైలర్ కి వచ్చే లైక్స్ అండ్ డిస్ లైక్స్ ని బట్టి తెలుస్తుంది…. కానీ రీసెంట్ టైం లో సుశాంత్ ఫ్యాన్స్ బాలీవుడ్ మేజర్ సినిమాలను అన్నింటిని టార్గెట్ చేయగా సడక్, ఖాళీ పీలి లాంటి సినిమాలకు రికార్డ్ లెవల్ డిస్ లైక్స్ తో షాక్ ఇచ్చారు. ఈ కారణంగానే ట్రైలర్ రిలీజ్ విషయం లో లక్ష్మీ బాంబ్ లేట్ అయినా…
ఇప్పుడు రిలీజ్ అవ్వడం లైక్స్ డిస్ లైక్స్ కనిపించకుండా హైడ్ చేసి ట్రైలర్ ని లాంచ్ చేశారు… దాంతో సినిమా కి ఎన్ని డిస్ లైక్స్ కొట్టినా అవి ఛానెల్ చూపెట్టే వరకు ఎవ్వరికీ తెలియవు… ఇలా ఒక స్టార్ హీరో సినిమా కి ఇప్పటి వరకు అవ్వలేదనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇదే మొట్ట మొదటి సారి అంటున్నారు… ఇక సినిమా ను కూడా బాయికాట్ చేయాలి అంటూ ఇప్పటి నుండే సోషల్ మీడియా లో ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో చూడాలి.