Home TRP రేటింగ్ అమ్మింది 1.4 కోట్ల రేటుకి…టాలీవుడ్ చరిత్రలో నిలిచిన TRP!!

అమ్మింది 1.4 కోట్ల రేటుకి…టాలీవుడ్ చరిత్రలో నిలిచిన TRP!!

0

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో ఆడియన్స్ ని బాగా అలరించిన సినిమాల్లో చిన్న సినిమా భానుమతి అండ్ రామకృష్ణ సినిమా కూడా ఒకటి, షార్ట్ అండ్ సింపుల్ గా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, సినిమాను కోటి లోపే బడ్జెట్ తో నిర్మించినా క్వాలిటీ గా ఉండటం తో ఆహా వీడియో వాళ్ళు 1.45 కోట్ల రేటు చెల్లించి రైట్స్ తీసుకున్నారు.

తర్వాత సినిమా కి వచ్చిన రెస్పాన్స్ చూసి జీ తెలుగు వాళ్ళు ఈ సినిమా కి 1.4 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా పెద్దగా ప్రచారం చేయకుండా సినిమాను టెలికాస్ట్ చేశారు.

దాని ఫలితం ఇప్పుడు టాలీవుడ్ మూవీస్ లో ఓ కొత్త రికార్డ్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది, ఇది వరకు టాలీవుడ్ లో టెలికాస్ట్ అయిన మూవీస్ లో లోవేస్ట్ TRP రేటింగ్ రికార్డ్ 2 డబ్బింగ్ తెలుగు మూవీస్ పేరిట ఉన్న విషయం తెలిసిందే.

చెలియా 1.87 TRP రేటింగ్ ని, క్రైం 23 మూవీ 1.86 TRP రేటింగ్ ని అందుకోగా… డైరెక్ట్ తెలుగు సినిమాలలో అసుర సినిమా 2.29 రేటింగ్ తో తెలుగు సినిమాలలో లోవేస్ట్ రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలవగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన భానుమతి అండ్ రామకృష్ణ మూవీ ఆల్ టైం లోవేస్ట్ రేటింగ్ ని అందుకున్న సినిమా గా నిలిచి షాక్ ఇచ్చింది.

ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 1.77 TRP రేటింగ్ మాత్రమె సొంతం చేసుకుని తెలుగు మూవీస్ పరంగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఆల్ టైం లోవేస్ట్ TRP రేటింగ్ ని దక్కించుకున్న సినిమా గా చరిత్రలో నిలిచింది, సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం తో ఇలాంటి రికార్డ్ సినిమా వశం అయ్యింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here