బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ టైంలో రవితేజ నటించిన సినిమాలు అన్నింటిలోకీ…
యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ట్రైలర్ రిలీజ్ తోనే అంచనాలు పెరిగి పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల 20 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది…
U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు రన్ పరంగా మాత్రం ఒకింత షాకిచ్చింది అని చెప్పొచ్చు… ఆల్ మోస్ట్ 3 గంటల 2 నిమిషాల లోపు లెంత్ తో ఈ సినిమా తెరకెక్కిందట. రీసెంట్ టైంలో రవితేజ మూవీస్ లో…
ఏ సినిమా కి ఇంత లెంత్ లేదనే చెప్పాలి. కానీ రియల్ స్టోరీని డీటైల్స్ తో చెబుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా కథ లెంత్ పెద్దదిగానే ఉంటుందని, ఆ లెంత్ చెప్పాలి అంటే ఇంత టైం అవసరమే అని అంటున్నారు….
కానీ ఈ రేంజ్ లెంత్ అంటే సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ చాలా అవసరం అని చెప్పొచ్చు, టాక్ బాగుంటే లెంత్ లాంటివి ఏమి పట్టించుకోకుండా సినిమాను జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ కొంచం టాక్ మిక్సుడ్ గా వచ్చినా డ్రాగ్, స్లో అంటూ కామెంట్స్ వినిపించవచ్చు,
కానీ టైగర్ నాగేశ్వరరావు విషయంలో ఇవేవి జరిగే అవకాశం తక్కువగానే ఉండగా… బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడానికి సిద్ధం అవుతూ ఉండటంతో అంచనాలను అందుకుని భారీ విజయాన్ని సినిమా సొంతం చేసుకోవాలని మనమూ కోరుకుందాం.