సోషల్ మీడియా రికార్డుల విషయంలో కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) పేరిట అనేక రికార్డులు ఉన్నాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా సినిమా సినిమాకి జోరు చూపిస్తూ దూసుకు పోతున్న విజయ్ మరో పక్క సోషల్ మీడియా రికార్డుల విషయంలో…
ఇండియా లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. విజయ్ సినిమాల టీసర్ లకు, ట్రైలర్ లకు, సాంగ్స్ కి వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తూ రీసెంట్ టైంలో సినిమా సినిమాకి జరుగుతూనే ఉందని చెప్పాలి.
రీసెంట్ గా విజయ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) నుండి అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గా ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్ రికార్డుల పరంగా మాత్రం బిగ్గెస్ట్ రికార్డులతో…
దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. కాగా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ఇప్పుడు ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను సొంతం చేసుకుని ఇండియన్ మూవీస్ లో ఏ ట్రైలర్ కూడా సాధించని రికార్డ్ ను నమోదు చేసింది…
కేవలం 21 నిమిషాల టైం మాత్రమే తీసుకుని ఈ ట్రైలర్ ఏకంగా 1 మిలియన్ మార్క్ లైక్స్ ని అధిగమించింది…. ఈ రేంజ్ లో యూట్యూబ్ రికార్డుల ఊచకోత ఇండియాలో ఏ హీరో ఫ్యాన్స్ కూడా చేయలేదు అనే చెప్పాలి. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం కూడా లేదనే చెప్పాలి…