Home న్యూస్ గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాల్లో జవాన్ ఆల్ టైం రికార్డ్!!

గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాల్లో జవాన్ ఆల్ టైం రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) బాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా 4 వారాలలో వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టించిన జవాన్ మూవీ ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్లు సాధించింది.

Jawan 17 Days Total WW Collections!!

సినిమా గల్ఫ్ దేశాల్లో ఇండియన్ మూవీస్ పరంగా ఏ సినిమా సాధించని రికార్డ్ ను నమోదు చేసింది. అక్కడ ఇప్పటి వరకు ఈ సినిమా 16 మిలియన్ డాలర్స్ వరకు వసూళ్ళని సొంతం చేసుకుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే…

132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని సాధించింది. ఇది వరకు అక్కడ రికార్డ్ కూడా షారుఖ్ పేరిటే ఉండటం విశేషం..బాహుబలి2 సినిమా అక్కడ టోటల్ రన్ లో 10.31 మిలియన్ డాలర్స్ ను అందుకుని రికార్డ్ కొడితే ఆ రికార్డ్ ను ఈ ఇయర్ పఠాన్(Pathaan Movie) తో…

బ్రేక్ చేసిన షారుఖ్ 14.20 మిలియన్ డాలర్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసి ఏకంగా కొత్త బెంచ్ మార్క్ ని కూడా సృష్టించాడు. ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Jawan 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here