యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా ఇక తర్వాత మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా తెలుగు రాష్ట్రాల్లో చూపించ లేక పోయింది. హిందీ లో అయినా సినిమా పర్వాలేదు అనిపించింది కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం రెండో రోజు నుండే భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని….
పరుగును చాలా త్వరగా కంప్లీట్ చేసుకుని అన్ని చోట్లా విపరీతమైన నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. కాగా సినిమా కి ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది… ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి…
తెలుగు రాష్ట్రాల్లో జరిగే రేంజ్ బిజినెస్ ఇది… అలాంటి సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో టోటల్ రన్ లో కేవలం 5.75 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…
అంటే 25 కోట్ల బిజినెస్ కి కేవలం 5.75 కోట్లు మాత్రమె రికవరీ చేసిన ఈ సినిమా ఏకంగా 19.25 కోట్ల రేంజ్ లో నష్టాన్ని ఒక్క ఈ ఏరియాలోనే సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ ఇన్ మీడియం రేంజ్ హీరోస్ మూవీస్ లో సొంతం చేసుకుని దిమ్మతిరిగే శాకిచ్చింది….