Home న్యూస్ ఒక్క డైలాగ్ తో హైప్ ను మరో లెవల్ కి పెంచేసిన మెగాస్టార్!!

ఒక్క డైలాగ్ తో హైప్ ను మరో లెవల్ కి పెంచేసిన మెగాస్టార్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత ఆడియన్స్ ముందుకు కంబ్యాక్ కి సిద్ధం చేసిన సినిమా గాడ్ ఫాదర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ విషయంలో టీం కంప్లీట్ గా నిరాశ పరిచింది. అసలు ఏమాత్రం హైప్ ను సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా ను ఇప్పుడు జస్ట్ ఒక్క డైలాగ్ తో మెగాస్టార్ తిరిగి వార్తల్లో నిలిచేలా చేశాడు….

రిలీజ్ కి పట్టుమని 15 రోజులు కూడా లేక పోయినా ఎలాంటి ప్రమోషన్స్ ఇంకా జరగడం లేదు అని అందరూ అనుకుంటూ ఉన్న తరుణంలో చిరు ట్విట్టర్ లో ఓ డైలాగ్ వాయిస్ ని రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ లో పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్….

నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను, కానీ ఆ రాజకీయం నా నుంచి ఇంకా దూరం కాలేదు అంటూ డైలాగ్ ను రిలీజ్ చేయగా సడెన్ గా ఈ డైలాగ్ విని అందరూ చిరు తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారా అంటూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేయగా టీవీ ఛానెల్స్ లో కూడా…

ఈ డైలాగ్ పై చర్చలు జరగడం స్టార్ట్ అవ్వడంతో తర్వాత అసలు మ్యాటర్ రివీల్ అయింది, ఇది సినిమాలో వచ్చే ఓ సన్నివేశంలో చెప్పే డైలాగ్ అని…. ఒక్క డైలాగ్ తో పడుకున్న ప్రమోషన్స్ కి తిరిగి హైప్ తెప్పించి మళ్ళీ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాడు చిరు. మరి సినిమా రానున్న రోజుల్లో భారీ ప్రమోషన్స్ ని జరుపుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here