బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఏ దశలో కూడా జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయంలో ఆల్ టైం ఎపిక్ లాస్ మూవీ గా నిలిచి నిరాశ పరిచింది.
అలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి రిలీజ్ కి ముందే భారీ హైప్ ఏర్పడటంతో శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కి ఓవరాల్ గా ఊహకందని రేటు సొంతం అవ్వగా అందులో ఇప్పుడు సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ రేటు బయటికి వచ్చింది.
మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో సినిమా కి సాధ్యం కాని డబుల్ డిజిట్ రేటు ని లైగర్ సొంతం చేసుకుంది. ఏకంగా 10.50 కోట్ల రేటుతో సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ వాళ్ళు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ తర్వాత టెలివిజన్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుందో అన్న ఆందోళన ఉండగా కమర్షియల్ మాస్ మూవీ నే అవ్వడంతో లాంగ్ రన్ లో టెలివిజన్ లో పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారని తెలుస్తుంది. మరి ఇదే నిజం అవుతుందో కాదో చూడాలి.