బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే… ఒకటి తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా రీ రిలీజ్ లు చేస్తూ ఉండగా జనాలు కూడా తమకి నచ్చిన సినిమాలను థియేటర్స్ లో చూడటానికి ఎగబడుతున్నారు… కానీ అందులో అప్పుడప్పుడు…
కొన్ని ఫ్లాఫ్ మూవీస్ కూడా ఉన్నప్పటికీ ఆ సినిమాల్లో ఆ టైం కి కనెక్ట్ అవ్వకపోవడమో లేక మ్యూజిక్ బాగా క్లిక్ అవ్వదమో కలెక్షన్స్ రావడానికి కారణాలు అవ్వగా ఇప్పుడు ఎలాంటి సందర్బం లేకుండానే నట సింహం నందమూరి బాలకృష్ణ(Nanadamuri Balakrishna) నటించిన…
ఒక ఆల్ టైం డిసాస్టర్ అలాగే మరో ఫ్లాఫ్ మూవీస్ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఒక్క మగాడు(Okka Magadu) మూవీ తో పాటు 2015 టైం లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫ్లాఫ్ అయిన…
లయన్ మూవీస్ ని త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. హిట్ మూవీస్ రీ రిలీజ్ చేసినా జనాలు చూస్తారేమో కానీ ఇలా ఫ్లాఫ్ టు అట్టర్ ఫ్లాఫ్ అయిన మూవీస్ ని రీ రిలీజ్ చేస్తే జనాలు చూస్తారు అనుకోవడం తప్పే అని చెప్పాలి. ఈ సినిమాల రీ రిలీజ్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి…