Home న్యూస్ 2.2 కోట్లు పెట్టి కొన్న సినిమా లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్…భారీ ఫైన్ తో షాక్...

2.2 కోట్లు పెట్టి కొన్న సినిమా లోకల్ ఛానెల్ లో టెలికాస్ట్…భారీ ఫైన్ తో షాక్ ఇచ్చిన ఈటీవీ

0

నిర్మాతలు కోట్లు కోట్లు పోసి సినిమాలు తీస్తుంటే, వాటిని ఇంకా ఎక్కువ కోట్లు పెట్టి టీవీ ఛానల్స్, స్ట్రీమింగ్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న వాళ్ళు లాంగ్ రన్ లో లాభాలు సొంతం చేసుకుంటారో లేదో అన్న డౌట్ లో ఉంటె… సినిమా మాస్టర్ ప్రింట్ వచ్చింది ఆలస్యం లోకల్ ఛానెల్స్ మాత్రం ఇవేవి పట్టించు కోకుండా ఆ సినిమాలను తమ ఛానెల్స్ లో వరుస పెట్టి టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు.

ఇది వరకు అంటే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయ్యాక రెండు నెలల తర్వాత మాస్టర్ ప్రింట్స్ వస్తే ఛానెల్ లో వేసే ముందే కొన్ని లోకల్ ఛానెల్స్ టెలికాస్ట్ చేసేవి, వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు, కానీ ఇప్పుడు…

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవుతున్న సినిమాల ప్రింట్స్ మొదటి రోజే HD లో రిలీజ్ చేస్తుంటే వాటిని కూడా కొన్ని లోకల్ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. రీసెంట్ గా ఇదే ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయం లో జరిగింది. ఈ సినిమాను హైదరాబాదు లోకల్ ఛానెల్ ఒకటి…

రీసెంట్ గా డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయగా ఆ టైం లో చూసిన కొందరు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 2.2 కోట్ల రేంజ్ రేటు కి కొన్న ఈటీవీ కి తెలియజేయడంతో త్వరలో టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్న టైం లో ఇలా ఇల్లీగల్ గా టెలికాస్ట్ చేయడంతో మండిపోయి సదరు ఛానెల్ కి ఏకంగా 1 కోటి ఫైన్ కట్టండి అంటూ….

నోటిసు పంపారట….దాంతో ఆ లోకల్ ఛానెల్ బయపడి ఈటీవీ తో ఇలాంటివి ఇంకెప్పుడు చేయమని బ్రతిమలాడుకోవడంతో వదిలేశారట. ఈ విషయం వేరే ఛానెల్స్ కి తెలిసి ఇలా చేస్తే ఇంకోసారి ఊరుకునేది లేదని అన్ని లోకల్ ఛానెల్స్ కి అల్టిమేట్ జారీ చేశారట. ఇక లోకల్ ఛానెల్స్ ఈ దెబ్బతో కొద్దిగా వెనక్కి తగ్గి కొద్ది టైం తర్వాతే టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here