Home న్యూస్ లవ్ మీ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

లవ్ మీ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) హీరోగా నటించిన రెండో సినిమా లవ్ మీ(Love Me Movie REVIEW) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి కాన్సెప్ట్ మూవీలా అనిపించగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మెప్పించే అవకాశం ఉంది అనిపించింది. కానీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….ఒక అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడే హీరోకి తను ఒక చనిపోయిన ఆత్మ అని తెలుస్తుంది. అయినా కూడా ఆ ఆత్మ ని ఇష్టపడే హీరో తన గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

ఆత్మని ఇష్టపడే అబ్బాయి…ఆత్మని వెతికి ప్రేమించడం…యూనిక్ పాయింట్ తో వచ్చిన లవ్ మీ మూవీ కాన్సెప్ట్ బాగున్నా కూడా చెప్పిన విధానం ఆకట్టుకునే విషయంలో డైరెక్టర్ అంచనాలు తప్పాడు. ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి మాత్రం….

కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో సాగిన సినిమా తర్వాత సీన్స్ ను ఆడియన్స్ చాలా ఈజీగా గెస్ చేసేలా ఉండగా డ్రాగ్ అవుతూ సాగిన సినిమా క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఎండ్ అవుతుంది…హీరోగా రెండో సినిమా చేస్తున్న ఆశిష్ మొదటి సినిమాతో పోల్చితే బాగా నటించి మెప్పించాడు. సటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెప్పించగా వైష్ణవి చైతన్య తన రోల్ వరకు మెప్పించగా…

మిగిలిన స్పెషల్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా బాగానే ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో ఎవరి రోల్స్ వాళ్ళు ఆకట్టుకున్నారు. సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండగా సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్ కి తగ్గట్లు బాగానే మెప్పించింది.

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉండగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ యూనిక్ గానే ఉన్నా కూడా అనుభవలేమి వలన యూనిక్ పాయింట్ ని చాలా వరకు వృధా చేశాడు….లెంత్ తక్కువే అయినా కూడా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలగగా మరీ కన్ఫ్యూజన్ తో కథని చెప్పకుండా ఉండి ఉంటే కొంచం బెటర్ గా అనిపించేది…

మొత్తం మీద సినిమాలో కథ పాయింట్ బాగానే ఉన్నా కూడా చెప్పిన విధానం పెద్దగా మెప్పించలేక పోవడంతో ట్రైలర్ చూసి ఎక్స్ పెర్టేషన్స్ పెట్టుకుని వెళితే మట్టుకు ఎక్కువ నిరాశ కలుగుతుంది, చాలా లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే కొంచం ఓపిక పట్టి చూస్తె సినిమా యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here