యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనేక కారణాల వలన ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా ఈ సారి ఎట్టి పరిస్థితులలో అనుకున్న టైం లో వస్తుంది అంటూ సెప్టెంబర్ 10 న సినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గా కన్ఫాం చేశారు కానీ…
సడెన్ గా మళ్ళీ ఏమి జరిగిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఆ డేట్ కి ఇప్పుడు గోపీచంద్ సీటిమార్ సినిమా బరిలోకి దిగబోతుంది. మరో పక్క సినిమా పోస్ట్ పోన్ కి ఆ రోజే డిజిటల్ లో రిలీజ్ అవుతున్న…
నాని టక్ జగదీష్ ఒక కారణం లేదా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల సమస్య అప్పటికి సాల్వ్ అవుతుంది అనుకున్నా సెప్టెంబర్ నెల గడిచే దాకా సమస్య కొలిక్కి వచ్చేలా లేకపోవడం లాంటి కారణాల వలన లవ్ స్టొరీ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ మంత్రం పాడింది అనుకున్నారు కానీ…
అసలు కారణాలు వీటితో పాటు మరో పెద్ద కారణం ఉందని అంటున్నారు. చివరి నిమిషంలో సినిమా రషెస్ ని చూసుకున్న టీం కొన్ని చోట్ల సీన్స్ పై ఫుల్ సాటిస్ ఫై గా లేకపోవడం తో కొన్ని సీన్స్ ని రీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని అంటున్నారు. ఆ కారణం వలనే సినిమా రిలీజ్ డేట్ ను మళ్ళీ….
పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది అంటున్నారు ఇప్పుడు… దాంతో ఇప్పుడు సినిమా కొత్త రిలీజ్ డేట్ గా సెప్టెంబర్ 30 న సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలో దింపాలని ఆ లోపు పనులు అన్నీ కంప్లీట్ చేసుకోవాలని, అప్పటికి ఆంధ్రలో టికెట్ రేట్ల సమస్య సద్దుమణిగితే డబుల్ ఖుషీ తో సినిమాను రిలీజ్ చేయొచ్చని ఆశిస్తున్నారట. మరి పరిస్థితులు అప్పటికీ అంతా నార్మల్ అవుతాయో లేదో చూడాలి.