యువ సామ్రాట్ నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టొరీ, ఒక పక్క ఫిదా సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల సాయి పల్లవి ల కాంబో మరో పక్క లాస్ట్ ఇయర్ మజిలీ సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన హీరో నాగ చైతన్య కలిసి చేస్తున్న సినిమా….
కావడం తో ఈ సినిమా పై మొదలు పెట్టినప్పటి నుండే మంచి అంచనాలు ఉన్నాయి… ఇక సినిమా ముందు సమ్మర్ లో రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా తర్వాత వచ్చే ఇయర్ రిలీజ్ అనుకున్నారు, దాంతో OTT వాళ్ళు ఈ సినిమా ను సంప్రదించలేదు…
కానీ రీసెంట్ గా సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టడం తో ఆఫర్లు భారీ లెవల్ లో వస్తూ ఉండగా అన్ని ఆఫర్ల కి నో చెబుతూ వచ్చారు యూనిట్, 25 కోట్ల ఆఫర్ నుండి మొదలు అయ్యి 30 కోట్ల మార్క్ ని తర్వాత 32 కోట్ల దాకా కూడా ఆఫర్లు వెళ్ళగా…
యూనిట్ నో చెబుతూ వచ్చారు, రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఏకంగా 34.5 కోట్ల రేంజ్ ఆఫర్ ని యూనిట్ ముందు పెట్టగా నిర్మాతలు టెంప్ట్ అయినా కానీ నాగ చైతన్య సీన్ లో మళ్ళీ ఎంటర్ అయ్యి సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చెప్పాడట. మొత్తం మీద రీసెంట్ టైం లో అన్ని సినిమాలకు రేట్లు తగ్గుతూ వస్తున్నా…
ఈ సినిమా కి మాత్రం ఓ రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి అని చెప్పాలి. ఇక సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కంప్లీట్ అయ్యిందని సమాచారం….ఇప్పుడు ఇక ఎలాగూ థియేటర్స్ రీ ఓపెన్ కానున్నాయి కాబట్టి టీం ఇప్పుడు పరిస్థితులను బట్టి దీపావళి, క్రిస్టమస్ లేదా సంక్రాంతి సీజన్స్ లో ఎదో ఒకటి ఎంచుకుని ఆ టైం కి సినిమా ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం….