Home న్యూస్ 25 కోట్ల ఆఫర్…మేం అమ్మం అన్నారు…ఇప్పుడు రేటు పెంచారు!

25 కోట్ల ఆఫర్…మేం అమ్మం అన్నారు…ఇప్పుడు రేటు పెంచారు!

0

డిజిటల్ రిలీజ్ కోసం కొన్ని సినిమాలకు రేట్లు ఎక్కువగా వస్తుంటే, కొన్ని సినిమాలకు తక్కువగా వస్తున్నాయి, చాలా సినిమాలు సమ్మర్ నుండే పోటి లో ఉండటం తో అప్పటి నుండే రేట్లు ఆఫర్ చేస్తూ రాగా అసలు ఇన్ని రోజులు ఎలాంటి డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ గురించిన న్యూస్ లేని సినిమా నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబో లో వచ్చిన లవ్ స్టొరీ. షూటింగ్ పెండింగ్ ఉండటం తో వచ్చే ఏడాది వస్తుంది…

అని కన్ఫాం అవ్వడం తో ఎవ్వరూ కూడా ఈ సినిమాను ఇన్ని రోజులు ట్రై చేయలేదు, కానీ రీసెంట్ గా సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు అవ్వడం మరో వారం పది రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని అంటూ ఉండటం తో ఈ సినిమా కోసం పోటి కొత్తగా మొదలు అయింది.

ఫస్ట్ ఆఫర్ కింద 25 కోట్ల రేంజ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్ ని చెప్పగా… యూనిట్ సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని OTT లో రిలీజ్ చేయమని క్లారిటీ గా చెప్పేశారు. అయినా కానీ తమ పనిగా ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయట అన్ని డిజిటల్ యాప్స్…

అందులో భాగంగా ఇప్పుడు OTT బిగ్గీ అమెజాన్ ప్రైమ్ ఏకంగా 30.5 కోట్ల రేంజ్ ఆఫర్ తో యూనిట్ ని అప్రోచ్ అయిందని ట్రేడ్ లూ టాక్ ఉంది. ఇది సాలిడ్ రేటు అనే చెప్పాలి. నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మూవీ మజిలీ తో పోల్చితే 9 కోట్ల రేంజ్ ఎక్కువే అనీ చెప్పాలి.

కానీ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్న యూనిట్ మాత్రం రేటు ఎంతైనా మా సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అని చెప్పేశారట. ఇక టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం థియేటర్స్ వచ్చే నెలలో రీ ఓపెన్ అయితే ఈ సినిమా ను ఇయర్ ఎండ్ క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారట… కుదరకపోతే… సంక్రాంతి రేసులో నిలిపే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here