Home న్యూస్ 7 సినిమాలు…5 సార్లు 100….ఒకే ఒక్కడు బెల్లంకొండ!!

7 సినిమాలు…5 సార్లు 100….ఒకే ఒక్కడు బెల్లంకొండ!!

0

టాలీవుడ్ లో 2014 లో అల్లుడు శీను సినిమా తో ఎంట్రీ భారీ లెవల్ లో ఇచ్చినా హిట్ కొట్టలేక పోయిన బెల్లంకొండ శ్రీనివాస్, ప్రతీ సినిమా ను కూడా భారీ హంగులతో రూపొందించడం మాత్రం ఆపలేదు, కెరీర్ లో చేసిన సినిమా లు మొత్తం మీద 7 ఉండగా 7 వ సినిమా తో మొదటి హిట్ ని అందుకున్న ఈ హీరో సినిమాలు అంటే నార్త్ ఆడియన్స్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంది…

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా హిందీ డబ్బింగ్ మూవీస్ తో సాలిడ్ రికార్డులను సొంతం చేసుకోగా, రీసెంట్ గా జయ జానకి నాయక సినిమా అక్కడ ఏకంగా 300 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని అల్టిమేట్ రికార్డ్ అందుకుంది.

ఇక రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మరో సినిమా అక్కడ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. కాజల్ అగర్వాల్ బెల్లంకొండ ల కాంబో లో తేజ డైరెక్షన్ లో వచ్చిన ఫ్లాఫ్ మూవీ సీత అక్కడ సీతా రామ్ గా డబ్ అవ్వగా… 15 రోజులు గడిచే సరికే…

100 మిలియన్ మార్క్ ని అందుకుని ఫాస్టెస్ట్ హిందీ డబ్బింగ్ మూవీస్ లో ఈ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవగా బెల్లంకొండ మూవీస్ లో 4 వ సారి ఈ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇది వరకు జయ జానకి నాయక, కవచం, అల్లుడు శీను సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా… కవచం సినిమా 2 ఛానెల్స్ లో రిలీజ్ అయ్యి…

ఒక ఛానెల్ లూ 215 మిలియన్స్ తో మరో ఛానెల్ లో 100 మిలియన్స్ తో దూసుకు పోతుంది, మొత్తం మీద చేసింది 7 సినిమాలే అయినా 4 సినిమాలు 100 మిలియన్స్ ని అందుకోగా ఓవరాల్ గా 5 సార్లు 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని తక్కువ సినిమాలతో ఈ రేంజ్ భీభత్సం సృష్టించి సంచలనం సృష్టించాడు బెల్లంకొండ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here