యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ మజిలీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యమ జోరు మీడుండగా, కెరీర్ లో మొట్ట మొదటి సారి 40 కోట్ల క్లబ్ లో కూడా చేరి దుమ్ము లేపాడు. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టొరీ పై అంచనాలు సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి.
కాగా ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా సినిమా ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ ఎలాగూ రీ ఓపెన్ అయ్యాయి కాబట్టి….
కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని సినీ లవర్స్ ఎదురు చూస్తుండగా లవ్ స్టొరీ సినిమాను ఇయర్ ఎండ్ కి కానీ లేదా సంక్రాంతి కి బరిలోకి దింపాలి అన్న ఆలోచనలో టీం ఉన్నారని టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ డేట్ కాదని కొత్త డేట్ ని అనుకుంటున్నారని టాక్ వస్తుంది.
టాలీవుడ్ లో అన్ సీజన్ భావించే నెలలలో ఫిబ్రవరి కూడా ఒకటి, నేను లోకల్, మిర్చి, టెంపర్, భీష్మ లాంటి కొన్ని సెలెక్టివ్ మూవీస్ తప్పితే ఫిబ్రవరి లో అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు లేవు… కానీ ఈ సినిమా లవ్ స్టొరీ బేసుడ్ మూవీ కాబట్టి సినిమా ను ఇప్పుడు…
ఫిబ్రవరి 14 లవర్స్ డే వీకెండ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఇది కనుక నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఇంపాక్ట్ గట్టిగా ఉండటం ఖాయమని చెప్పొచ్చు. సంక్రాంతి లేదా జనవరి 26 వీకెండ్ ని ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్ అని అంటున్నారు. మరి టీం ఫైనల్ గా ఏ డేట్ ని ప్రిఫర్ చేస్తారో చూడాలి.