Home గాసిప్స్ ఫ్యాన్స్ దెబ్బకి తలపట్టుకున్న లక్ష్మీ బాంబ్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్!!

ఫ్యాన్స్ దెబ్బకి తలపట్టుకున్న లక్ష్మీ బాంబ్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్!!

0

నెపోటిజం పై పోరు ఒకవైపు తమ హీరో కి అవకాశాలు దక్కకుండా చేశారని మరికొందరి పై కోపం, ఛాన్సులు ఇవ్వలేదని నిర్మాతలపై ఆగ్రహం ఇలా సుశాంత్ ఫ్యాన్స్ టోటల్ బాలీవుడ్ ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు… సుశాంత్ ఇప్పుడు మన మధ్యన లేకున్నా కానీ తన గురించి అనేక విషయాలు ఎవ్వరికీ తెలియనివి ఇప్పటికె బయటికి రావడం తో అది బాలీవుడ్ కి తీవ్ర ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా స్టార్ కిడ్స్ కి…

స్టార్ కిడ్స్ సినిమాలకు ఇది వరకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కాదు, టీసర్ లు, ట్రైలర్ లు రికార్డ్ డిస్ లైక్స్ ని తెచ్చుకుంటూ ఉండగా కరణ్ జోహార్ లాంటి నిర్మాతలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, ఇక సుశాంత్ చేయాల్సిన…

కొన్ని సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ పై కూడా ఫ్యాన్స్ లో భారీగా వ్యతిరేకత ఉండగా ఆ ఎఫెక్ట్ తో బయపడి లక్ష్మీ బాంబ్ ట్రైలర్ రిలీజ్ ని ఆలస్యం చేసినా పరిస్థితి సద్దుకోక పోవడం తో ట్రైలర్ కి లైక్స్ డిస్ లైక్స్ కనిపించకుండా చేశారు. ఇక ఇప్పుడు భయం మరింతగా పెరిగి పోతుంది.

దానికి కారణం రీసెంట్ గా ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ సినిమాను బాయికాట్ చేయాలి అంటూ సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ చేశారు… ఆల్ మోస్ట్ లక్ష రేంజ్ లో ట్వీట్స్ పడి నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వగా సినిమాను 125 కోట్లకు కొన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ ఎఫెక్ట్ యాప్ పై కూడా పడుతుందని బయపడుతుంది.

యాప్ ని అన్ ఇన్ స్టాల్ చేయండి అంటూ కూడా ట్రెండ్ చేయడం తో వాళ్ళు భయంతో ఉండగా సినిమాను జనాలు చూస్తారా లేదా అన్న డౌట్ లో టీం కూడా ఉంది. మొత్తం మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం నవంబర్ 8 న సినిమా రిలీజ్ టైం లో తెలుస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here