బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మీ(Love Me Movie REVIEW) ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీగా చెప్పుకోవచ్చు…కొంత టైంగా చాలా డ్రై గా సాగుతున్న టాలీవుడ్ లో ఎంతో కొంత థియేటర్స్ కి…
ఫీడింగ్ గా ఈ సినిమా నిలుస్తుందని అందరూ అనుకుంటూ ఉండగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గానే సినిమా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి అక్కడ నుండి వినిపిస్తున్న ఫస్ట్ టాక్ ఎలా ఉంది అంటే మాత్రం కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్పాలి…
స్టోరీ పాయింట్ ని ఏమి లీక్ చేయడం లేదు కానీ దెయ్యాలంటే అస్సలు భయం లేని హీరో ఒక దెయ్యాన్ని లవ్ చేస్తాడు…ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…కోర్ పాయింట్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే పరంగా అనుకున్న రేంజ్ లో సినిమాను డైరెక్టర్ మలచలేక పోయాడు అన్న టాక్ ప్రీమియర్స్ నుండి వినిపిస్తుంది…
కొన్ని చోట్ల హర్రర్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని, కొన్ని చోట్ల కొంచం సిల్లీగా అనిపించింది అని సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఉండగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం ఎక్కువగా డ్రాగ్ అయినట్లు అనిపించింది అని అంటున్నారు..
డైరెక్టర్ కథ పాయింట్ బాగానే రాసుకున్న చెప్పిన విధానం చాలా వరకు కన్ఫ్యూజింగ్ గా అలాగే కొన్ని చోట్ల సస్పెన్స్ సీన్స్ ను సైతం ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి ఎక్స్ పెర్టేషన్స్ లేకుండా వెళ్ళే ఆడియన్స్ చాలా ఓపికతో సినిమా చూడాలి అని అంటున్నారు…
ఓవరాల్ గా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత లవ్ మీ మూవీకి ఆడియన్స్ నుండి కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. ఓవర్సీస్ ఆడియన్స్ నుండి హర్రర్ కామెడీ లాంటి మూవీస్ కి చాలా వరకు మిక్సుడ్ రెస్పాన్స్ వస్తుంది, ఇక రెగ్యులర్ షోలు అయ్యే టైంకి కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.