Home న్యూస్ బాహుబలినే లేపెస్తాం అన్నారు….మినిమమ్ పస కూడా లేదు!!

బాహుబలినే లేపెస్తాం అన్నారు….మినిమమ్ పస కూడా లేదు!!

0

బాహుబలి ని మించే సినిమా తీయాలని అన్ని ఇండస్ట్రీల వాళ్ళు అనుకోవడం ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే సినిమాలు అంటూ వచ్చినవి ఆ అంచనాలను అందుకోవడం విఫలం అవ్వడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా మొదటి పార్ట్ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండింగ్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా…

ట్రైలర్ రిలీజ్ తర్వాత బాహుబలిని కూడా తక్కువ చేసి సోషల్ మీడియాలో ఆ సినిమా రికార్డులను ఎగరేసి కొడతాం అంటూ కామెంట్స్ చేశారు…. కానీ రిలీజ్ కి వారం మాత్రమే టైం ఉన్నా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా పొన్నియన్ సెల్వన్ సినిమా చూపించడం లేదు…

తమిళనాడు వరకు సినిమా పై హైప్ ఉంది కానీ తమిళనాడు ఆవల ఎక్కడ కూడా ఈ సినిమా ఇంపాక్ట్ మినిమమ్ కూడా లేదు అనే చెప్పాలి ఇప్పటి వరకు…. అన్ని సినిమాల మాదిరిగానే మరో డబ్బింగ్ మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది అన్న ఆలోచనలోనే జనాలు ఉన్నారు కానీ….

బాహుబలి లాంటి ఓ ఎపిక్ ని చూస్తాం అన్న ఫీలింగ్ లో ఆడియన్స్ లేరు, అలాగే మేకర్స్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడం విషయంలో ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి… సినిమా ఔట్ పుట్ ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమాను అన్ని చోట్లా మినిమమ్ ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయడం కచ్చితంగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉండగా…

ఇప్పుడు తేరుకుని రిలీజ్ కి ముందు నామ మాత్రంగా కొన్ని చోట్ల ప్రమోషన్స్ కి సిద్ధం అవుతున్నా కానీ ఎక్కడా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ఉండేలా అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ వర్షన్ మినహా మిగిలిన చోట్ల ఇంపాక్ట్ చాలా తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here