కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ లూసిఫెర్… అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా అక్కడ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఏకంగా 150 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం. కాగా ఈ సినిమాను రీసెంట్ గా తెలుగులో అదే పేరు తో డబ్ చేసి రిలీజ్ చేశారు, కాగా తెలుగు లో సినిమాను ఓన్ గా రిలీజ్ చేశారు.
కాగా ఆ ఓన్ రిలీజ్ వర్త్ సుమారు 1.2 కోట్ల రేంజ్ లో ఉంటుందట, కానీ అది ఓన్ రిలీజ్ కాబట్టి బిజినెస్ లోకి రాదు, ఇక సినిమా పబ్లిసిటీ మరియు ప్రింట్స్ ఖర్చులు మొత్తం మీద కలిపి 60 లక్షల రేంజ్ లో ఉంటుందట. కానీ లూసిఫెర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేయలేదు.
సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 52 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందని సమాచారం, టోటల్ గ్రాస్ 1.15 కోట్ల వరకు ఉంటుందట. మొత్తం మీద సినిమాను కొన్న బయర్ల కి రూపాయి మిగలేదు, ఇక శాటిలైట్ రైట్స్ నుండే ఎంతో కొంత రావాలని ఎదురు చూస్తున్నారు.