Home న్యూస్ మామా మశ్చీంద్ర ట్రైలర్ రివ్యూ….కుమ్మిందిగా ట్రైలర్…హిట్ పక్కా!

మామా మశ్చీంద్ర ట్రైలర్ రివ్యూ….కుమ్మిందిగా ట్రైలర్…హిట్ పక్కా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న హీరోలలో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు… రీసెంట్ టైంలో వరుస సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ అంచనాలను అందుకునే సినిమాలు చేయలేక పోయిన సుదీర్ బాబు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

మరో కొత్త సినిమాతో రాబోతూ ఉండగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ తో మరో రొటీన్ మూవీనే ఏమో అనిపించిన మామా మశ్చీంద్ర(Maama Mascheendra) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు ఇప్పుడు… ట్రైలర్ చూసిన తర్వాత…

ఇది కచ్చితంగా సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉన్న సినిమాగా అనిపించడం ఖాయం. సినిమాలో మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న సుదీర్ బాబు మూడు రోల్స్ కూడా వేరియేషన్స్ ని చూపించి మెప్పించాడు అని చెప్పాలి…

సినిమా లో కథ పాయింట్ మేనమామ మరియు ఇద్దరు మేనల్లుళ్ళ మధ్య జరిగిన ఓ గొడవ… ఆ తర్వాత మేనమామ కూతుళ్ళని ఆ ఇద్దరు మేన అల్లుడులు ప్రేమించగా…వాళ్ళు సీరియస్ గా ప్రేమిస్తున్నారా లేక నటిస్తున్నారా అనుకునే మేనమామ తన అల్లుళ్ళ పై…

తన పగని తీర్చుకున్నాడో లేదో అన్న కాన్సెప్ట్ సినిమా ట్రైలర్ ఓవరాల్ గా బాగా మెప్పించేలా కట్ చేశారు… ఓవరాల్ గా ట్రైలర్ రిలీజ్ కి ముందు ఏమాత్రం అంచనాలు సినిమా మీద లేక పోయినా ఇప్పుడు మాత్రం సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా ట్రైలర్ మెప్పించింది. ఇక అక్టోబర్ 6న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here