బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం సినిమా వరల్డ్ వైడ్ గా 940 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు అనే చెప్పాలి.
దాంతో రిలీజ్ రోజు రాఖీ పండగ అడ్వాంటేజ్ ఉండటంతో మాస్ సెంటర్స్ లో సినిమా బాగానే ఓపెన్ అయినా క్లాస్ సెంటర్స్ లో మాత్రం బిలో యావరేజ్ గానే బుకింగ్స్ ఉన్నాయి, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు ముగిసే సరికి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…
జోరు కొద్ది వరకు చూపించే అవకాశం ఉండటంతో తొలిరోజు ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని బట్టి చెప్పాలి అంటే 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే గ్రోత్ ని బట్టి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
మొత్తం మీద మొదటి రోజు 2.8 నుండి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. మరి సినిమా డే ఎండ్ అయ్యే టైం కి ఎలా హోల్డ్ చేసి ఈ మార్క్ కి మించిపోయే రేంజ్ లో ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో లేదో చూడాలి ఇక…