బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ 2 ఏళ్లలో హిట్స్ కి దూరం అయిన హీరో నితిన్. భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ కి తర్వాత చేసిన చెక్ సినిమా కానీ రంగ్ దే సినిమా కానీ భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇవ్వగా ఇప్పుడు కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు మాచర్ల నియోజకవర్గం సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు.
వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కి అద్బుతమైన బిజినెస్ జరిగింది అని చెప్పాలి ఓవరాల్ గా… సినిమా మాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా అవ్వడంతో ట్రేడ్ లో సినిమా పై పర్వాలేదు అనిపించే రేంజ్ లో బజ్ ఏర్పడగా…
బిజినెస్ కూడా సాలిడ్ గా జరిగింది అని చెప్పాలి. రంగ్ దే లాంటి డిసాస్టర్ ఇంపాక్ట్ ఉండటంతో ఆ సినిమా తో పోల్చితే కొంచం తక్కువ బిజినెస్ జరిగినా కానీ ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న పరిస్థితులను గమనించి చెప్పాలి అంటే ఎక్కువ బిజినెస్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి ఈ సినిమా…
ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 6Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 10Cr
AP-TG Total:- 19CR
👉Ka+ROI: 1Cr
👉OS – 1.20Cr
Total WW: 21.20CR
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా మాచర్ల నియోజకవర్గం సినిమా సాధించిన టోటల్ బిజినెస్ లెక్క. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో బిజినెస్ సాధించగా…
ఇప్పుడు హిట్ గీతని దాటాలి అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 22 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి సినిమా ఎలా ఉంటుంది, ఎంతవరకు జోరు చూపించి ఈ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి ఇక….