బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమా తర్వాత చేసిన చెక్ అండ్ రంగ్ దే సినిమాలు రెండూ నిరాశ పరిచిన తర్వాత నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజక వర్గం. ఆడియన్స్ ముందుకు ఆగస్టు 12న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత కథ పరంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన రెగ్యులర్…
మాస్ మూవీలానే అనిపించినా కానీ క్వాలిటీ, హీరోయిజం ఎలివేట్ సీన్స్, ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో రొటీన్ అయినా కానీ బాగుంది అనిపించేలా మెప్పించింది మాచర్ల నియోజకవర్గం సినిమా థియేట్రికల్ ట్రైలర్… ట్రైలర్ లోనే ఆల్ మోస్ట్ సినిమా కథ పాయింట్ ని రివీల్ చేశారు…
ఫ్యామిలీతో హ్యాప్పీగా ఉండే హీరో కలెక్టర్ గా అసలు ఎలక్షన్స్ జరగడం ఆగిపోయిన మాచర్ల నియోజకవర్గానికి వెళతాడు… అక్కడ అడ్డంకులను ఎలా తొలగించాడు. హీరోని అడ్డుకోవాలని చూసిన విలన్ సముద్రఖని ఏమయ్యాడు అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… మొత్తం మీద ఇది ఫక్తు కమర్షియల్ మూవీ ని ట్రైలర్ లోనే క్లియర్ చేసి స్టొరీ…
ఎలా ఉండబోతుంది అన్నది రివీల్ చేసి ఆడియన్స్ కి ఒక ఐడియా ఇచ్చారని చెప్పొచ్చు. ఇక ఎంటర్ టైన్ మెంట్ కరెక్ట్ గా సెట్ అయ్యి కథ కన్విన్సింగ్ గా ఉంటే రొటీన్ కథనే అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… నితిన్ న్యూ లుక్ కూడా ఆకట్టుకోగా క్లాస్ అండ్ మాస్ రెండు లుక్స్ తో మెప్పించాడు.
ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మొత్తం మీద ట్రైలర్ సినిమా పై అంచనాలను అయితే పెంచేలా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇదే రేంజ్ లో మెప్పించగలిగితే నితిన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సాలిడ్ హిట్ పడినట్లే లెక్క అని చెప్పాలి.