సమ్మర్ కానుకగా ఈ నెల ఎండ్ నుండి వరుస పెట్టి సినిమాలు నాన్ స్టాప్ గా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా వాటిలో సీక్వెల్ ఫ్యాక్టర్ తో మంచి బజ్ నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) సినిమా…
మొదటి పార్ట్ చిన్న సినిమా గా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోగా రెండో పార్ట్ మీద మంచి అంచనాలు ఉండగా…ఆల్ రెడీ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అండ్ టీసర్ బజ్ ను మరింతగా పెంచేసింది. ఇక సినిమా కూడా ఈ వీక్ లో రిలీజ్ కాబోతూ ఉండగా….
ఆల్ రెడీ బజ్ సాలిడ్ గా ఉండటంతో ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ దూసుకు పోతున్న మ్యాడ్2 మూవీ నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ లక్ష కి పైగా డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది..
టోటల్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క కోటి గ్రాస్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…ఇదంతా కూడా ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకుండానే ఉన్న ఊపు కాగా ట్రైలర్ రిలీజ్ అయ్యి మినిమమ్ ఓకే అనిపించే రేంజ్ లో ఉన్నా…
ఈ సమ్మర్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను సాలిడ్ గా షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బజ్ కూడా సాలిడ్ గానే ఉండటంతో జస్ట్ హిట్ టాక్ వస్తే ఇక చిన్న సినిమానే అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పాలి.