హాలీవుడ్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సినిమా మాడ్ మాక్స్: ఫ్యూరియోసా(Mad Max Furiosa – A Mad Max Saga Movie), మొదటి పార్ట్ 2015 టైంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఇక ఆ సినిమాకి ప్రీక్వెల్ గా భారీ అంచనాల నడుమ రూపొందిన పార్ట్ 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి…
మంచి రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కానీ ఎందుకో కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు…ఇటు ఇండియాలో కూడా సినిమా మంచి జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా ఇక్కడ కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది ఈ సినిమా…మొత్తం మీద ఇండియాలో వీకెండ్ లో…
ఈ సినిమా 11 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక అమెరికాలో ఓవరాల్ గా వీకెండ్ లో 26 మిలియన్ డాలర్స్ ను మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 216 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూల్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 34 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసింది…
ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 282 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. హాలీవుడ్ లో మంచి స్ట్రాంగ్ వీకెండ్ లోనే రిలీజ్ అయినా కూడా మొత్తం మీద లాంగ్ వీకెండ్ లో సినిమా 60 మిలియన్ డాలర్స్ ను మాత్రమే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీలో గ్రాస్ 498 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది…
సినిమా ఇండియాలో వీకెండ్ లో మినిమమ్ 22-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఎక్స్ పెర్ట్ చేయగా వరల్డ్ వైడ్ గా లాంగ్ వీకెండ్ లో 80-85 మిలియన్ డాలర్స్ ను ఎక్స్ పెర్ట్ చేసినా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. హిట్ టాక్ తో కూడా అనుకున్న రేంజ్ లో వసూళ్ళని సినిమా అందుకోలేక పోయింది.