బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో చాలా సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా అందులో అందరూ కొత్త యాక్టర్స్ తో తెరకెక్కిన సినిమా మ్యాడ్(MAD The Movie)….సినిమా నిర్మాత నాగవంశీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాతిరత్నాలు కన్నా ఒక్క తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు రిటర్న్ అన్నారు. మరి సినిమా ఆ రేంజ్ లో ఉందో లేదో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే…ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజ్ లైఫ్ అలాగే కాలేజ్ లైఫ్ అయ్యే టైంకి ఉన్న పరిస్థితుల నేపధ్యంలో తెరకెక్కిన సినిమానే మ్యాడ్…. ఇక్కడ ఒక పాయింట్ ని యాడ్ చేయాలి… కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే బాగుంటే కథ ఎలా ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు…
కొన్ని సినిమాల కథ బాగున్నా స్క్రీన్ ప్లే బాగా లేక పోతే ఆ కథ కనెక్ట్ అవ్వదు… మొదటి కోవలోకి చెందే సినిమానే మ్యాడ్…. కథ గురించి అసలు పట్టించుకోకుండా సీన్ బై సీన్ ను 70% కి పైగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది మ్యాడ్ మూవీ.. లాజిక్ లు కథ పెద్దగా లేక పోయినా కూడా…..
సింగిల్ లైన్ జోకులు, పంచులు, కొన్ని అడల్ట్ జోకులు ఇలా చాలా సీన్స్ చూస్తున్న ఆడియన్స్ ను బాగా నవ్విస్తాయి. ఫస్టాఫ్ పర్వాలేదు బాగుంది అనిపించేలా మెప్పించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచితే సెకెండ్ ఆఫ్ కూడా చాలా సీన్స్ బాగా నవ్వించి మంచి టైం పాస్ మూవీగా అనిపిస్తుంది మ్యాడ్ మూవీ…
ముగ్గురు మెయిన్ లీడ్ రోల్స్ చేసిన యాక్టర్స్ అందరూ బాగా నటించారు, హీరోయిన్స్ పర్వాలేదు, మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించగా పాటలు పర్వాలేదు అనిపిస్తాయి, స్క్రీన్ ప్లే ఎడిటింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. 2 గంటల టైం లో బోర్ అయ్యే సీన్స్ చాలా తక్కువే అని చెప్పాలి.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించగా డైరెక్టర్ కథని పెద్దగా డెవలప్ చేయకున్నా సీన్ బై సీన్ ఎంటర్ టైన్ చేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు… సినిమా చూస్తున్న టైంలో కాలేజ్ స్టోరీ పాయింట్ తో వచ్చిన హ్యాప్పీడేస్, హిందీ 3 ఇడియట్స్, ఇలా కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి…
ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ ని అస్సలు పట్టించుకోకుండా హ్యాప్పీగా 2 గంటలు హాయిగా ఎంజాయ్ చేయాలి అంటే మ్యాడ్ మూవీకి వెళ్ళొచ్చు….మరీ జాతిరత్నాలు రేంజ్ లో కాకపోయినా కూడా ఆ సినిమా దగ్గర దాకా వెళ్ళింది అని చెప్పొచ్చు మ్యాడ్ మూవీ… సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…