యూత్ స్టార్ నితిన్ వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో నితిన్ లేటెస్ట్ మూవీ మాస్ట్రో సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తె అర్ధం అవుతుంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అంధ ధూన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ తో పాటు తమన్నా నభా నటేష్ లు కలిసి నటించారు. సినిమా మొదలు అయిన్నప్పుడు మంచి బజ్ నే సొంతం చేసుకుంది కానీ…
ఈ లోపు నితిన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటం తో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై పడి ఈ లోపు సెకెండ్ వేవ్ కూడా రావడం తో థియేట్రికల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి ఒప్పుకున్న ఈ సినిమా…
థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ ఒరిజినల్ వర్షన్ ట్రైలర్ కి యాసిటీస్ కాపీ పేస్ట్ లా ఉంది, ఏమాత్రం కొత్తదనం లేకుండా రీమేక్ అంటే సీన్ టు సీన్ దింపేశారు. ఒరిజినల్ ని చెడగొట్టకూడదు అని అలా చేసిన్నప్పటికీ కూడా ఆశించిన రెస్పాన్స్ అయితే రాలేదు.
ఇక ట్రైలర్ రెండు ఛానెల్స్ లో రిలీజ్ అవ్వగా ఒక ఛానెల్ లో 24 గంటల్లో 3.15 మిలియన్ వ్యూస్ ని 102.9K లైక్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ టైం లో నితిన్ కన్నా చిన్న హీరోలకు ఇంకా బెటర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక మరో ఛానెల్ లో కొంచం లేట్ గా రిలీజ్ అవ్వగా అక్కడ 24 గంటల్లో 757K వ్యూస్ ని 30.6K వేల లైక్స్ ని సాధించింది.
దాంతో టోటల్ గా రెండు ఛానెల్స్ కలిపి 24 గంటల్లో 3.9 మిలియన్ వ్యూస్ ని 133.5K లైక్స్ ని మాత్రమె సొంతం చేసుకుని చాలా సాధారణమైన రెస్పాన్స్ ను దక్కించుకుంది. వరుస ఫ్లాఫ్స్ ఎఫ్ఫెక్ట్ తో మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయిన మాస్ట్రో ఇక రిలీజ్ అయ్యాక ఒరిజినల్ ని ఎంతవరకు మరిపించగలుగుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది ఇప్పుడు.