9 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులతో సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఆ సమయంలో ఇండియా లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9 ఏళ్ల తర్వాత ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయిన మగధీర సినిమా కి అక్కడ బ్రహ్మరధం పడుతున్నారు. సినిమా అక్కడ మొదటి వారం లోనే ఏకంగా 1.7 మిలియన్ జపాన్ యెన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ లో 11.3 కోట్ల గ్రాస్.
ఇక రెండో వీకెండ్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిందట ఈ సినిమా. ఓవరాల్ గా రెండో వీకెండ్ లో 0.95 మిలియన్ జపాన్ యెన్స్ ని కలెక్ట్ చేసిందట. దాంతో టోటల్ గా 10 రోజులకి గాను 2.72 మిలియన్ జపాన్ యెన్స్ ని కలెక్ట్ చేసిందట ఈ సినిమా. అమెరికన్ డాలర్స్ లో 2.45 మిలియన్ ను ఇండియన్ కరెన్సీ లో 17.47 కోట్ల గ్రాస్ ని అందుకుని జపాన్ లో ఇండియన్ మూవీస్ లో కుంభస్థలాన్ని దక్కించుకుని చరిత్ర కెక్కిందట ఈ సినిమా.